Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs CSK: ఔట్ అయిన తరువాత మళ్లీ బ్యాటింగ్ చేసిన సాహా! అయినా ఫలితం లేకపాయే!!

SRH vs CSK: Wriddhiman Saha Got Out On A No Ball Still Couldnt Captalise The Chance

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా యూఏఈలోని షార్జా క్రికెట్ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఎప్పటిలానే హైదరాబాద్ జట్టు బ్యాటర్లు తేలిపోతున్నారు. చెన్నై బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి ఎస్‌ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ ఇబ్బందులు పడింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ బ్యాటింగ్ చేస్తున్నారు.

అయితే ఈ మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నో బాల్‌కు ఔట్ అయ్యాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతికి సాహా ఔట్ అయ్యాడు. ఠాకూర్ మూడో బంతిని షార్ట్ పిచ్ బంతిగా వేయగా.. సాహా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకున్నాడు. చెన్నై సంబరాల్లో మునిగిపోగా.. అంపైర్ నో బాల్‌ అంటూ షాక్ ఇచ్చాడు. అలా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సాహా.. మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. అప్పటికి సాహా 32 బంతుల్లో 33 రన్స్ చేశాడు. ఆపై మరో మూడు ఓవర్ల పాటు క్రీజుల్ ఉన్నా.. ఫలితం లేకుండా పోయింది. రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్ మూడో బంతికి కీపర్ ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో 44 రన్స్ చేశాడు.

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఇప్పటికే ఆడిన 10 మ్యాచుల్లో 8 గెలిచి.. ప్లే ఆఫ్ చేరింది. ఈ మ్యాచ్ గెలిస్తే అధికారిక బెర్త్ దక్కనుంది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వరుస ఓటములతో దాదాపు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నా.. గణాంకాల ప్రకారం ఏదో చిన్న అవకాశం ఉంది. అందుకోసం కేన్ సేన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోతే.. ఎస్‌ఆర్‌హెచ్ అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై జట్టే ఈ మ్యాచులో ఫెవరెట్.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్లు 16 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 12 సార్లు గెలుపొందగా.. ఎస్‌ఆర్‌హెచ్ 4 మాత్రమే విజయాలు అందుకుంది. గతేడాది షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచులో సీఎస్‌కే గెలుపొందింది. గత ఐదు మ్యాచులో చెన్నై మూడు గెలువగా.. హైదరాబాద్ రెండు విజయాలు అందుకుంది. ఇక ఐపీఎల్ 2021లో ఈ రెండు తలపడిన మ్యాచులో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ 2, చెన్నై 5.. రెండోసారి బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ 2, చెన్నై 7సార్లు గెలుపొందాయి. షార్జా క్రికెట్ స్టేడియంలోని పిచ్ గతంలో మాదిరిగా లేదు. పిచ్ నెమ్మెదిగా ఉండడంతో ఈ సంవత్సరం పరుగులు చేయడానికి బ్యాటర్లు కష్టపడుతున్నారు.

Story first published: Thursday, September 30, 2021, 21:06 [IST]
Other articles published on Sep 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+