
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్ది సేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మహీ ఒక మార్పు చేశాడు. స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో జట్టులోకి వచ్చాడు. సామ్ కరన్ బదులుగా బ్రావో మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే ఎస్‌ఆర్‌హెచ్ కొనసాగించింది.
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఆడిన 10 మ్యాచుల్లో 8 గెలిచి.. ప్లే ఆఫ్ చేరింది. ఈ మ్యాచ్ గెలిస్తే అధికారిక బెర్త్ దక్కనుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో దాదాపు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నా.. గణాంకాల ప్రకారం ఏదో చిన్న అవకాశం ఉంది. అందుకోసం కేన్ సేన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోతే.. ఎస్‌ఆర్‌హెచ్ అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై జట్టే ఈ మ్యాచులో ఫెవరెట్.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు 16 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 12 సార్లు గెలుపొందగా.. ఎస్‌ఆర్‌హెచ్ 4 మాత్రమే విజయాలు అందుకుంది. గతేడాది షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచులో సీఎస్‌కే గెలుపొందింది. గత ఐదు మ్యాచులో చెన్నై మూడు గెలువగా.. హైదరాబాద్ రెండు విజయాలు అందుకుంది. ఇక ఐపీఎల్ 2021లో ఈ రెండు తలపడిన మ్యాచులో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ 2, చెన్నై 5.. రెండోసారి బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ 2, చెన్నై 7సార్లు గెలుపొందాయి. షార్జా క్రికెట్ స్టేడియంలోని పిచ్ గతంలో మాదిరిగా లేదు. పిచ్ నెమ్మెదిగా ఉండడంతో ఈ సంవత్సరం పరుగులు చేయడానికి బ్యాటర్లు కష్టపడుతున్నారు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.