Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs CSK: గైక్వాడ్, డుప్లెసిస్ మెరుపులు..ఉత్కంఠ పోరులో చెన్నై విజయం! సన్‌రైజర్స్‌ కథ కంచికే!!

SRH vs CSK: Chennai beat Sunrisers to become the 1st team to book spot in play-offs

షార్జా: ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ చివరలో ఉత్కంఠ రేగినా.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో సిక్స్ బాది విజయాన్ని అందించాడు. ఈ విజయంతో చెన్నై అధికారిక ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోగా.. హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.

అదిరే ఆరంభం:

135 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (45), ఫాఫ్ డుప్లెసిస్‌ (40) ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు పంపుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో సన్‌రైజర్స్‌ బౌలర్లు అసహనానికి గురయ్యారు. ఈ ఇద్దరి ధాటికి మ్యాచ్‌ రెండు మూడు ఓవర్ల ముందుగానే ముగుస్తుందనిపించింది. అయితే జట్టు స్కోర్ 75 వద్ద రుతురాజ్‌ ఔట్ అయ్యాడు. ఈ సమయంలో మొయిన్ అలీ.. డుప్లెసిస్‌కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి చెన్నై స్కోర్ 100 దాటించారు.

చివరలో ఉత్కంఠ:

అయితే చెన్నై జట్టు స్కోరు 100 పరుగులు దాటిన తర్వాత స్వల్ప తేడాతో మొయిన్ అలీ (17), సురేశ్‌ రైనా (2), ఫాఫ్ డుప్లెసిస్‌ వరుసగా అవుట్‌ అయ్యారు. దీంతో చెన్నై పరుగుల వేగం మందగించింది. ఈ క్రమంలో చెన్నై లక్ష్యం రెండు ఓవర్లలో 16 పరుగులుగా మారింది. అయితే 18 ఓవర్లలో అంబటి రాయుడు ఓ సిక్స్‌, ఎంఎస్ ధోనీ ఫోర్‌ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో మూడు పరుగులు అవసరం కాగా.. మొదటి మూడు బంతులకు కేవలం ఒకే రన్‌ వచ్చింది. క్రీజులో రాయుడు, ధోనీ ఉన్నప్పటికీ కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ధోనీ సిక్స్‌తో తనదయిన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఆదుకున్న సాహా:

ఆదుకున్న సాహా:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్‌రైజర్స్‌ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (2) త్వరగానే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దాంతో తక్కువ స్కోరుకే సన్‌రైజర్స్‌ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (44) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ధాటిగా మాత్రం ఆడలేకపోయాడు. దీంతో సన్‌రైజర్స్‌ స్కోర్ బోర్డు నెమ్మదించింది. ప్రియం గార్గ్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది.

రషీద్‌ మెరవకుంటే:

కాసేపటికే ఓ లైఫ్ లభించిన వృద్ధిమాన్ సాహా కూడా హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన అభిషేక్‌ శర్మ (18), అబ్దుల్ సమద్‌ (18) నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. అయితే ధాటిగా మాత్రం ఆదాలకేపోయారు. ఇక జోష్ హేజిల్‌ వుడ్‌ వేసిన 17వ ఓవర్లో ఇద్దరూ ఔటవ్వడంతో హైదరాబాద్‌ జట్టుకి మరోసారి గట్టి షాక్‌ తగిలింది. స్టార్ ప్లేయర్ జేసన్‌ హోల్డర్‌ (5) నిరాశ పరిచాడు. చివర్లో బ్యాటింగ్‌ వచ్చిన రషీద్‌ ఖాన్‌ (17), భువనేశ్వర్‌ కుమార్ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రషీద్ మెరవకుంటే సన్‌రైజర్స్‌ ఇంకా తక్కువ పరుగులే చేసేది. చెన్నై బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్‌ 3, డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీసుకోగా.. శార్ధూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, September 30, 2021, 23:36 [IST]
Other articles published on Sep 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+