For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH: వాళ్లపై వేటు- ఓటమి బాధతో కావ్య సంచలన నిర్ణయం

టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది. కనీస పోటీ ఇవ్వకుండానే ప్రత్యర్థికి దాసోహమైంది. అయితే టైటిల్ పోరు మినహా మిగిలిన ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేసిన పోరాటం అద్వితీయం. క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలామ్ కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు.

అయితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఎన్నో సానుకూలాంశాలతో పాటు ప్రతికూలాంశాలు ఉన్నాయి. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పేలవ ప్రదర్శన చేసింది. 2023లో పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. ఆ తర్వాత కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే విజేతగా నిలవడానికి జట్టును మరింత సానబెట్టేలా ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ భావిస్తుంది.

SRH to Undergo Major Changes Kavya Maran Plans to Drop Players After IPL 2024 Final Loss

ఫైనల్ ఓటమి బాధతో ఫ్రాంచైజీ కోఓనర్ కావ్య మారన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లపై వేటు వేయాలని భావిస్తున్నారు. జట్టుకు భారంగా ఉన్న ఆటగాళ్లను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన అబ్దుద్ సమద్‌పైనే తొలి వేటు పడనున్నట్లు తెలుస్తుంది. బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ మ్యాచ్‌ మినహా ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కీలక మ్యాచ్‌ల్లో తడబడ్డాడు. క్వాలిఫయిర్-1లో 16 పరుగులు, క్వాలిఫయిర్-2లో డకౌట్, ఫైనల్‌లో కేవలం నాలుగు పరుగులే చేశాడు.

తుది జట్టు కూర్పులో ఇమడని ఆటగాళ్లను కూడా వదిలిపెట్టాలని ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఉండటంతో ఎక్కువగా అవకాశాలు దక్కని మయాంక్ అగర్వాల్‌కు సన్‌రైజర్స్ గుడ్‌బై చెప్పనుంది. అలాగే విదేశీ స్టార్ ప్లేయర్లు ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జేన్సన్, యువ క్రికెటర్లు అన్మోల్ ప్రీత్ సింగ్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌ను విడిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. అన్మోల్‌ప్రీత్, సన్వీర్ సింగ్‌కు తక్కువ అవకాశాలే ఇచ్చినప్పటికీ పేలవ ఆటతో నిరాశపరిచారు.

Story first published: Tuesday, May 28, 2024, 13:30 [IST]
Other articles published on May 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+