‘డెత్’ఆడి.. పోచమ్మ గుడి, సన్ రైజర్స్ డెత్ బౌలింగ్ అట్లుంటది మరీ

సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులు, ప్రముఖులు వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు టీమ్‌లు ఈ సీజన్లో విజయాల పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇరు టీంలకు ప్రధానంగా బౌలింగే బలం. ఇక సన్ రైజర్స్ బౌలర్లు.. గత మ్యాచ్‌లో ఆర్సీబీని చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సీజన్లో డెత్ ఓవర్లలో అత్యుత్తమ బౌలింగ్ కూడా సన్ రైజర్స్‌దే. డెత్ ఓవర్లలో సన్ రైజర్లు అత్యధికంగా 21వికెట్లు తీశారు. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ 8వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా గెలవడానికి సై అంది. ఈ సీజన్లో వరుసగా రెండో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తాం మా గెలుపును అడ్డుకోగలరా అంటూ గుజరాత్ టైటాన్స్‌కు దేత్తడి పోచమ్మగుడి అనే రేంజులో సన్ రైజర్స్ ఇప్పటికే సవాల్ విసిరింది.
టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకుంటాడు
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తమ సంచలన బౌలింగ్ అటాక్‌తో భయంకరమైన టచ్‌లో ఉన్నాయన్నాడు. నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించబోతున్నారని తెలిసినప్పుడు రెండు జట్ల బ్యాటింగ్ యూనిట్లు చాలా డిఫెన్సివ్‌గా ఆడతాయన్నాడు. ఇక టాస్ విషయానికొస్తే కేన్ విలియమ్సన్ వరుసగా 7టాస్‌లు గెలిచాడు. ఈసారి కూడా గెలిస్తే అతను తన ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటాడని నైట్ అభిప్రాయపడ్డాడు.

కచ్చితంగా టఫ్ గేమ్ చూడొచ్చు
నైట్ ఈ మ్యాచ్ విషయంలో తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. 'ఒకవేళ హార్దిక్ పాండ్యా టాస్ గెలిస్తే.. అతను బౌలింగ్ ఎంచుకుంటాడో.. బ్యాటింగ్ ఎంచుకుంటాడో తెలియదు. అతను ఎంచుకున్న విషయాన్ని బట్టి కాస్త ప్రత్యర్థి జట్టుకు ఎడ్జ్ ఉండడమో, లేక మైనస్ కావడమో జరగొచ్చు. ఏదేమైనా థ్రిల్లింగ్ మ్యాచ్ జరగడం ఖాయం. పదునైన పేస్‌తో మంచి బౌలింగ్ యూనిట్లు ఇరువైపులా ఉన్నప్పుడు కచ్చితంగా ఒక టఫ్ గేమ్ చూడొచ్చు అని నైట్ పేర్కొన్నాడు.

నటరాజన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా
మహమ్మద్ కైఫ్ ఈ మ్యాచ్ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. నటరాజన్ ఫామ్, అతని బౌలింగ్ నైపుణ్యాలను ప్రశంసించాడు. 'గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు నటరాజన్ పెద్ద సవాలుగా మారతాడు. నటరాజన్ రెండు మూడు రకాల వైవిధ్యంగా బౌలింగ్ చేయగలడు. బంతిని ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ చేయగలడు. అతను యార్కర్ల కింగ్. ఈ సంవత్సరం యార్కర్లతో పాటు మరికొన్ని బౌలింగ్ అస్త్రాలతో చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఇలాంటి మార్పు బౌలింగ్లో చాలా అవసరం. బౌలింగ్ ఒకేరకంగా వేస్తే.. బ్యాట్స్‌మన్ సులువుగా అంచనా వేసి హిట్టింగ్ ప్రారంభిస్తాడు. నటరాజన్, హార్దిక్ పాండ్యా ఇద్దరు ఫామ్‌లో ఉన్నందున వారిద్దరి మధ్య టఫ్ బ్యాటిల్ జరగడం ఖాయం' అని పేర్కొన్నాడు.

ఇప్పటివరకు ఇదే అత్యుత్తమం..
ఇప్పటివరకు సన్ రైజర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సన్ రైజర్స్ ప్రధాన అస్త్రం బౌలింగే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలర్లు చెలరేగుతుండడం శుభపరిణామం. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు 21వికెట్లు తీశారు. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధికంగా డెత్ ఓవర్లలో వికెట్లు తీసింది సన్ రైజర్సే. డెత్ ఓవర్లు వేయడంలో భువీ, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లాంటి పేసర్లు మంచి నైపుణ్యం కలిగి ఉండడం సన్ రైజర్స్‌కు ప్రధాన బలమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్.. ఒక మ్యాచ్‌లో చివరి ఓవర్ మెయిడిన్ చేయడమే కాకుండా 4వికెట్లు తీసి సత్తా చాటాడు. నట్టూ సైతం లో ఫుల్ టాస్‌లు, యార్కర్లతో బెంబేలెత్తిస్తాడు. భువీ సైతం వైడ్ యార్కర్లు.. సడెన్ షార్ట్ పిచ్ బంతులు, స్లో డెలివరీలతో రాణిస్తున్నాడు. ఇక జాన్సేన్ సైతం వికెట్ టేకరే. సుచిత్, సుందర్ ఇద్దరూ కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ.. మ్యాచ్‌ను మలుపు తిప్పే స్పిన్నర్లే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications