సీఎస్‌కేలోకి రషీద్ ఖాన్.. సన్‌రైజర్స్ స్పిన్నర్ డ్రీమ్ నెరవేరాలంటే?! ధోనీ వార్నింగ్!

Rashid Khan reveals valuable advice he received from MS Dhoni | Oneindia Telugu

కాబూల్: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడు. బ్యాట్స్‌మన్‌గా టీమిండియాకు తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు. టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తనదైన ముద్ర వేశాడు. వికెట్ల వెనకాల నుంచి మహీ ఇచ్చే సలహాలతో ఎందరో బౌలర్లు అత్యుత్తమ శిఖరాలకు చేరుకున్నారు. అందుకే ధోనీ సారథ్యంలో ఆడాలని ప్రతిఒక్క బౌలర్ తన డ్రీమ్‌గా పెట్టుకుంటారు. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు.

సీఎస్‌కేలోకి రషీద్

సీఎస్‌కేలోకి రషీద్

ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆడాలని రషీద్ ఖాన్ డ్రీమ్‌. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. అందుకే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున రషీద్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అతడు వేలంలోకి వెళితే.. చెన్నైకి ఆడడానికే మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ తరఫున అతడు ఆడుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ, ఐపీఎల్‌లో రషీద్ తిరుగులేని స్పిన్నర్‌గా ఎదుగుతున్నాడు. అతడు విసిరే వైవిధ్య గూగ్లీలకి టాప్ బ్యాట్స్‌మెన్‌లు సైతం తడబడుతున్నారు. ఐపీఎల్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా స్వేచ్ఛగా ఆడలేని ఏకైక బౌలర్ రషీద్ అనడం అతిశయోక్తి లేదు. రషీద్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడడానికే చూస్తారు.

ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది నా కల

ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది నా కల

తాజాగా ఓ యూట్యూబ్ షోలో రషీద్ ఖాన్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది నా కల. ధోనీ అనుభవం ఒక బౌలర్‌గా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. వికెట్ల వెనుక నుంచి ధోనీ కంటే ఏ వికెట్ కీపర్ మెరుగ్గా సలహాలు ఇవ్వగలడు?. ఐపీఎల్‌లో చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత మేము ఇద్దరం మైదానంలో చాలా సమయం మాట్లాడుకుంటాం. ఆ సమయంలో ఎన్నో సలహాలు, సూచనలు నేను తీసుకుంటా.

నా బౌలింగ్‌లో ఏవైనా లోపాలున్నాయా అని అడుగుతా. అందుకు మహీ ఓపిగ్గా సమాధానాలు ఇస్తాడు' అని తెలిపాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 ఆగిపోవడంతో రషీద్ అఫ్గానిస్థాన్ వెళ్లిపోయాడు. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ యూఏఈ వేదికగా జరగనున్నాయి.

WTC Final: అశ్విన్‌కి ఛాన్స్ ఇచ్చి.. జడేజాపై వేటు వేయాలి: పార్థీవ్ పటేల్

 మహీ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు

మహీ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు

చివరిసారి కలిసినప్పుడు ఎంఎస్ ధోనీ తనకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడని రషీద్ ఖాన్ తెలిపాడు. 'ఫీల్డింగ్‌లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంత తీవ్రతతో త్రో విసరాల్సిన అవసరం లేదు. రషీద్ ఖాన్ ఒక్కడే ఉన్నాడు. అతని నుంచి అభిమానులు ఇంకా మెరుగైన ప్రదర్శనలు చూడాలని కోరుకుంటున్నారు. ఒకవేళ నీకు గాయమైతే పరిస్థితి ఏంటి?. ఇది ఎప్పుడూ గుర్తుంచుకో. రవీంద్ర జడేజాకి ఇదే విషయాన్ని చెప్పా' అని ధోనీ హెచ్చరించాడని రషీద్ పేర్కొన్నాడు. ధోనీ కెప్టెన్సీలో రషీద్ ఆడాలంటే.. చెన్నై టీమ్‌లోకి రావడం మినహా మరో ఆప్షన్ లేదు. మరి రషీద్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.

 కోహ్లీ అడ్డదిడ్డంగా ఆడాలని చూడడు

కోహ్లీ అడ్డదిడ్డంగా ఆడాలని చూడడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా మంది బ్యాట్స్‌మెన్‌లలో తనకి కనిపించలేదని రషీద్ ఖాన్ తెలిపాడు. 'మైదానంలోకి చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు ఒత్తిడిలో వస్తుంటారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే.. ఒత్తిడిలో స్వీప్, స్లాగ్ స్వీప్ లేదా భిన్నమైన షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు.

విరాట్ కోహ్లీ అలా కాదు. అడ్డదిడ్డంగా ఆడాలని చూడడు. కోహ్లీ సక్సెస్ కావడానికి ఇది ఓ కారణం. మంచి బంతుల్ని కోహ్లీ గౌరవిస్తాడు.. బంతి ఏమాత్రం గతి తప్పినా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు. కోహ్లీ ఎప్పుడూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్‌లలో నాకు అది కనిపించలేదు' అని రషీద్ అన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 8, 2021, 15:32 [IST]
Other articles published on Jun 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X