వార్నర్.. బాల్‌టాంపరింగ్‌తో నిషేధానికి గురైనా నీకు బుద్ది రాలేదు: కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్ గెలుపుపై వార్నర్ అవహేళనగా కామెంట్ చేయడంతో అతనిపై తీవ్ర ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు.

ఇక సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉండే ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఐపీఎల్ టైటిల్ ఫొటోను షేర్ చేశాడు. దీనికి ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను ఏ జట్టు గెలుస్తుందనుకుంటున్నారో చెప్పండని అభిమానులను ప్రశ్నిస్తూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే చాలా మంది సన్‌రైజర్స్ హైదరాబాదే గెలుస్తుందని చెప్పగా.. ఒకరిద్దరు మాత్రం తమ అభిమాన జట్ల పేర్లను పేర్కొన్నారు.

ఆర్సీబీని ఎగతాళి చేసి..

ఈ నేపథ్యంలో ఓ అభిమాని కోల్‌కతా నైట్ రైడర్స్ చెప్పగా.. వారిని ఓడించడం కొంచెం కష్టమేనని వార్నర్ కామెంట్ చేశాడు. మరొక అభిమాని ఈ సీజన్ టైటిల్‌ను ఆర్సీబీ గెలుస్తుందనగా.. నిజమా? అంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు. ఈ కామెంట్‌కు చిర్రుత్తుకుపోయిన ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వార్నర్‌ను ఓ ఆట ఆడుకున్నారు.

ఇంత ఇగోనా..?

ఇంత ఇగోనా..?

‘వార్నర్.. వచ్చే సీజన్‌కు భారత్‌కు వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఏంటో చూపిస్తారు.. కానీ ఇప్పుడు మాత్రం విరాట్, ఏబీడీ, మోహిన్ అలీ, స్టెయిన్, సైనీ, చహల్ తమ సత్తా ఏంటో నీకు చూపిస్తారు'అని ఒకరు కామెంట్ చేయగా.. ‘బాల్ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా నీలో ఎలాంటి పరిపక్వత రాలేదు. అభిమానులంతా నిన్ను, స్మిత్‌ను ర్యాగ్ చేస్తుంటే కోహ్లీ అడ్డుకున్నాడు. నీ అభిమానిని అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా.. ఇంత ఇగోనా మరి?'అని మరోకరు ఘాటుగా కామెంట్ చేశారు. ఇలా తమకు తోచిన విధంగా కామెంట్ చేస్తూ వార్నర్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

దుబాయ్ వేదికగా ఐపీఎల్..

దుబాయ్ వేదికగా ఐపీఎల్..

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2020 సీజన్‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వనకు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నదమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టోర్నీ విధివిధానాలను సిద్దం చేసిన బీసీసీఐ.. ఆటగాళ్లను తరలించేందుకు ఫ్రాంచైజీలను సంసిద్దం చేస్తోంది. దుబాయ్‌, షార్జా, అబుదాబి వేదికగా 53 రోజుల పాటు ఈ క్యాష్ రిచ్ లీగ్ అభిమానులను కనువిందు చేయనుంది.

ఐపీఎల్ నిర్వహణకు ఇప్పటికే ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అవసరమైన అనుమతులు కూడా వారం రోజుల్లో వస్తాయని, ఈ నెల చివరలో జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టొచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా..

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును డేవిడ్ వార్నర్‌ నడిపించనున్నాడు. టాంపరింగ్ ఉదంతంతో 2018 సీజన్‌కు దూరమైన వార్నర్.. గత సీజన్ ఆడినా ఆటగాడిగానే కొనసాగాడు. గత రెండు సీజన్లలో కేన్ విలియమ్సన్ జట్టును అద్భుతంగా నడిపించినా ఫ్రాంచైజీ పెద్దలు మరోసారి వార్నర్‌పై నమ్మకం ఉంచారు. 2014 నుంచి హైదరాబాద్ తరఫున ఆడుతున్న వార్నర్.. 2016 సీజన్‌లో టైటిల్ అందించాడు. ఫైనల్లో ఆర్సీబీని ఓడించి మరి విజేతగా నిలబెట్టాడు.

ఇప్పటి వరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్ 126 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్.. 4,706 రన్స్ చేశాడు. 2015,2017,2019 సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి ఆరేంజ్ క్యాప్ అందుకున్నాడు. తద్వారా ఎక్కువ సార్లు ఆరేంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 4, 2020, 13:42 [IST]
Other articles published on Aug 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X