For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Practice Match 2022: నికోల‌స్ పూర‌న్ విధ్వంసం.. కేన్ మామ టీంపై భువి టీం బంప‌ర్ విక్ట‌రీ

SRH Practice Match 2022: Bhuvneshwar kumar Team Beat Kane Williamson Team by 6 Wickets

ఐపీఎల్ 2022 స‌న్నాహాకాల్లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ జ‌ట్టు ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగానే ఆట‌గాళ్లంతా రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. రెండు టీంల‌ను కేన్ విలియ‌మ్స‌న్ టీంగా, భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీంగా విడ‌దీశారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఎప్పటిక‌ప్పుడు తెలియ‌చేసింది. అలాగే యూట్యూబ్‌లోనూ లైవ్ పెట్టింది. కాగా ఈ మ్యాచ్‌లో కేన్ మామ టీంపై భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీం బంప‌ర్ విక్ట‌రీ సాధించింది.

కేన్ విలియమ్స‌న్ టీం స్కోర్

మొద‌ట బ్యాటింగ్ చేసిన కేన్ విలియ‌మ్స‌న్ టీం నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టుకు ఓపెన‌ర్లు కేన్ విలియ‌మ్స‌న్, ప్రియ‌మ్ గార్గ్ శుభారంభాన్ని అందించారు. స‌న్‌రైజ‌ర్స్ ట్విట్ట‌ర్ ఖాతా అప్‌డేట్ల ప్ర‌కారం వీరిద్ద‌రు 37 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి విలియ‌మ్స‌న్ టీం 2 వికెట్ల న‌ష్టానికి 63 ప‌రుగులు చేసింది. ఇక 16 ఓవ‌ర్లు ముగిసే స‌మయానికి 3 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు చేసింది. ఆ స‌మ‌యంలో క్రీజులో త్రిపాఠి (24), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (26) ఉన్నారు. భువి టీం బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో కేన్ మామ టీం చివ‌రి 4 ఓవ‌ర్ల‌లో 32 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

భువి టీం విజ‌యం

అనంత‌రం 147 ప‌రుగుల సాధార‌ణ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భువి టీం మ‌రో 5 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. నికోల‌స్ పూర‌న్ 30 బంతుల్లోనే 45 ప‌రుగులు చేసి జ‌ట్టును గెలిపించాడు. లక్ష్య చేధ‌న‌లో ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ఆర్ సమర్థ్.. భువి టీంకు శుభారంభాన్ని అందించారు. వీరిద్ద‌రి తొలి వికెట్‌కు 5 ఓవ‌ర్ల‌లోనే 51 ప‌రుగులు అజేయ హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో 10 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి 2 వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగుల‌తో భువి టీం ప‌టిష్ట స్థితిలో నిలిచింది. మొత్తంగా మ‌రో 5 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ టీం ల‌క్ష్యాన్ని అందుకుంది.

స్కోర్లు:

కేన్ విలియ‌మ్స‌న్ టీం: 146-6

భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీం: 147-4

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి టీం

కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మాక్ర‌మ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ప్రియమ్ గార్గ్, జె సుచిత్, శ్రేయాస్ గోపాల్, అభిషేక్ శర్మ, రొమారియో షెఫర్డ్, సీన్ అబ్బాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్‌హక్ ఫరూకీ

Story first published: Monday, March 21, 2022, 21:31 [IST]
Other articles published on Mar 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+