For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిని వదిలించుకోనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ - లిస్ట్ ప్రిపేర్ చేసిన కావ్యా మారన్..!!

 SRH Possible released Players list, Romario Shepherd, Suchith and Sean Abbott and others included

ముంబై: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌కు ముహూర్తం సమీపిస్తోంది. ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ ఆరంభం కాబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇందులో న్యూజిలాండ్-పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. ఈ మెగా ఈవెంట్‌ సెమీ ఫైనల్స్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన బ్లాక్ క్యాప్స్‌తో ఢీ కొట్టబోతోంది పాకిస్తాన్.

సెమీ ఫైనల్ కోసం..

సెమీ ఫైనల్ కోసం..

రెండో సెమీ ఫైనల్ ఎల్లుండి షెడ్యూల్ అయింది. అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఛాంపియన్ ఎవరనేది సాయంత్రానికి స్పష్టమౌతుంది.

మినీ వేలం కోసం..

మినీ వేలం కోసం..

ఈ పరిణామాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తాజా అప్‌డేట్ బయటికొచ్చింది. ఈ నెల 15వ తేదీ నాటికి రిటెన్షన్ ప్లేయర్ల తుది జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు అందజేయాల్సి ఉంది అన్ని ఫ్రాంచైజీలకు. దీనికోసం ఆయా ఫ్రాంఛైజీల మేనేజ్‌మెంట్లన్నీ కసరత్తు పూర్తి చేస్తోన్నాయి. డిసెంబర్‌లో నిర్వహించే మినీ వేలం పాట కోసం విడుదల చేయదలిచిన ప్లేయర్లతో కూడిన జాబితాకు తుది రూపాన్ని ఇస్తోన్నాయి.

సన్‌రైజర్స్ లిస్ట్..

సన్‌రైజర్స్ లిస్ట్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ లిస్ట్ కూడా దాదాపుగా ప్రిపేర్ అయినట్టే కనిపిస్తోంది. జట్టులో అట్టి పెట్టుకునే ప్లేయర్లు ఎవరు? ఎవరిని మినీ ఆక్షన్ కోసం విడుదల చేయాలి?- అనే అంశాలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అంచనాలకు అనుగుణంగా రాణించని ప్లేయర్లను వదిలించుకోవడానికి సిద్ధపడింది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్. ఆశించిన స్థాయిలో ఆడలేని వారికి జట్టు నుంచి ఉద్వాసన పలకనుంది.

ఉద్వాసనకు గురయ్యేది వీరే..

ఉద్వాసనకు గురయ్యేది వీరే..

ఉద్వాసనకు గురయ్యే ప్లేయర్ల జాబితా పెద్దదే. విదేశీ, స్వదేశీ క్రికెటర్లు ఇందులో ఉన్నారు. రొమారియో షెప్పర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో కేప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, ప్రియం గర్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, నికొలస్ పూరన్, అభిషేక్ శర్మ, మార్కో జెన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకోనుంది.

 పేలవ ప్రదర్శన..

పేలవ ప్రదర్శన..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచ్‌లల్లో ఎనిమిదింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానం సరిపెట్టుకుందీ ఆరెంజ్ ఆర్మీ. ఈ సీజన్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు కేన్ విలియమ్సన్. 216 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ- అతణ్ని కొనసాగించనుంది. పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను కూడా అట్టి పెట్టుకుంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, వెస్టిండీస్ కేప్టెన్ నికొలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నట్టే.

.

Story first published: Tuesday, November 8, 2022, 13:13 [IST]
Other articles published on Nov 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+