Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: స్టార్ ప్లేయర్ ఎంట్రీ.. రాజస్థాన్‌తో ఆడే తుది జట్టు ఇదే

SRH Playing 11: ఐపీఎల్-2024లో మెగా పోరుకు సమయం ఆసన్నమైంది. ఫైనల్‌ బెర్తు కోసం క్వాలిఫయిర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. శుక్రవారం చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు చెపాక్ వేదికగానే ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడుతుంది.

ఈ సీజన్‌లో అదిరే విజయాలు, రికార్డు స్కోరులతో రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌కు క్వాలిఫయిర్-1లో చుక్కెదురైంది. కేకేఆర్ చేతిలో ఓడింది. ఈ పరాజయంతో కొన్ని పాఠాలు నేర్చుకున్న ఎస్‌ఆర్‌హెచ్ బలమైన రాజస్థాన్‌ను ఢీ కొననుంది. అయితే బౌలింగ్‌కు అనుకూలించే చెపాక్‌లో రాజస్థాన్‌ను ఓడించడం హైదరాబాద్‌కు అంత తేలిక కాదు. రాజస్థాన్‌ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, చాహల్, బౌల్ట్ క్వాలిటీ బౌలర్లు ఉన్నారు.

SRH Playing XI vs Rajasthan Royals Markram Returns Sundar Replaces Shahbaz Ahmed

మరోవైపు సన్‌రైజర్స్ జట్టులో అనుభవజ్ఞ స్పిన్నర్లు ఎవరూ లేరు. దీంతో చెపాక్ పిచ్ గురించి అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకురావాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. సుందర్‌ చెన్నైకి చెందని వ్యక్తి . అంతేగాక యశస్వీ జైస్వాల్‌ను కట్టడి చేయడానికి ఈ ఆఫ్ స్పిన్నర్ పవర్‌ప్లేలో ఉపయోగపడతాడు. షాబాజ్ అహ్మద్ స్థానంలో సుందర్‌ను ఎంపిక చేయాలని సన్‌రైజర్స్ చూస్తోంది.

అయితే కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయిర్-1లో విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆదిలోనే పెవిలియన్‌కు చేరారు. అనంతరం కీలక భాగస్వామ్యాలు నెలకొల్పే అనుభవజ్ఞుడు లేకపోవడంతో సన్‌రైజర్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా స్టార్ ప్లేయర్ మార్క్‌రమ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. విజయ్‌కాంత్ వియస్కాంత్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.

SRH Playing XI vs Rajasthan Royals Markram Returns Sundar Replaces Shahbaz Ahmed

కాగా, ఐపీఎల్‌లో ఇరు జట్లు 19 మ్యాచ్‌లు ఆడగా, సన్‌రైజర్స్ పదింట్లో, రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌‌హెచ్‌దే పైచేయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఒక్క పరుగు తేడాతో నెగ్గింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్/షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్

Story first published: Thursday, May 23, 2024, 15:29 [IST]
Other articles published on May 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+