
సమతూకంగా కన్పిస్తున్న ఢిల్లీ జట్టు
ఢిల్లీ జట్టు ప్రస్తుతం సమతూకంగా కన్పిస్తుంది. కరోనా వల్ల ఆ జట్టు కాస్త దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ క్లిక్ అవుతున్నారు. ఈ జోడీ కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఇక వన్ డౌన్లో దిగుతున్న మార్ష్ ఈ మ్యాచ్‌లోనూ అదే స్థానంలో బరిలోకి దిగనున్నాడు. నంబర్ 4స్థానంలో కెప్టెన్ పంత్, 5స్థానంలో లలిత్ యాదవ్, 6వ స్థానంలో రోవ్ మాన్ పావెల్ యథాప్రకారం బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఇక అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ సైతం బ్యాటింగ్ చేయగల సమర్థులే. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సత్తా చాటుతుండడం ఢిల్లీకి కలిసొస్తుంది. ముస్తాఫిజుర్, చేతన్ సకారియా పొదుపుగా బౌలింగ్ చేస్తుండడం కూడా ఢిల్లీకి ప్లస్ పాయింటే. అయితే వారు జట్టుగా ఆడుతున్నప్పుడు జరిగే చిన్నచిన్న మిస్టేక్స్ మాత్రం అవైడ్ చేయాల్సిన అవసరముంది. ఇక ఈ మ్యాచ్‌లో సేమ్ టీంనే ఢిల్లీ కొనసాగించే వీలుంది.

సన్ రైజర్స్ ఇప్పుడు బ్యాటింగ్ జట్టు కూడా
ఇక జట్టు పరంగా చూసుకుంటే సన్ రైజర్స్ చాలా పటిష్ఠంగా కన్పిస్తోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను ముందు గాడిలో పెట్టేలా ఆడుతున్నారు. ఇక వన్ డౌన్లో రాహుల్ త్రిపాఠి విధ్వంసరచన చేస్తున్నాడు. మార్క్రామ్, నికోలస్ పూరన్ సైతం ఫాంలో ఉండడంతో ఆ జట్టు మిడిలార్డర్ బలంగా కన్పిస్తుంది. చివర్లో శశాంక్ సింగ్ సైతం హిట్టింగ్ చేయగల సమర్థుడే. బౌలింగ్ యూనిట్ గురించి చెప్పనక్కర్లేదు. కాగా వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అతని స్థానంలో జగదీష్ సుచిత్ బరిలోకి దిగనున్నాడు.

DC vs SRH ప్లేయింగ్ XI ప్రెడిక్షన్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ్ సుచిత్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్


Click it and Unblock the Notifications












