ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సమరానికి సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని సొంత మైదానంలో చెలరేగాలని ఎస్‌ఆర్‌హెచ్ కసిగా సన్నద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓడినప్పటికీ హైదరాబాద్ పోరాటం అద్వితీయం.
అయితే బలమైన ముంబై ఇండియన్స్‌పై పైచేయి సాధించడానికి సన్‌రైజర్స్ ప్రణాళికలు రచిస్తోంది.తుదిజట్టు కూర్పు గురించి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లన్నీ ఆతిథ్య జట్లే విజయం సాధించాయి. ఈ లెక్కను కొనసాగిస్తూ హార్దిక్ సేనను చిత్తుచేయాలని హైదరాబాద్ ప్లాన్ వేస్తోంది.

ఆధిక్యం ఎవరిది?
ఐపీఎల్‌లో హైదరాబాద్, ముంబై 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. SRH తొమ్మిదింట్లో, ముంబై 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌దే పైచేయి. 2022లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్సే గెలిచింది.
హెడ్‌కు నిరాశే
గత మ్యాచ్‌లో ఆడిన తుది జట్టునే కొనసాగించాలని SRH యాజమాన్యం భావిస్తోంది. ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జేన్సన్‌తో పాటు కెప్టెన్ కమిన్స్ ఓవర్సీస్ ప్లేయర్లుగా తుదిజట్టులో కొనసాగనున్నారు. దీంతో వేలంలో రూ.6.80 కోట్లు పలికిన హైదరాబాద్ నయా ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు నిరాశే మిగిలనుంది. కాగా, కోల్‌కతా మ్యాచ్‌లో స్పిన్నర్ మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాబాజ్ అహ్మద్ ఒక్క ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చాడు.
సుందర్‌పై వేటు!
కానీ ఉప్పల్ మైదానంలో మార్కండే, షాబాజ్ బంతితో సత్తాచాటుతారనే నమ్మకంతో వారిద్దరికి SRH యాజమాన్యం మరో అవకాశం ఇస్తుంది. పైగా షాబాజ్ బ్యాటుతో మెరిశాడు. దీంతో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో రావడానికి మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా రాణించడంతో సుందర్‌ను బెంచ్‌కే పరిమితం చేయనున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జేన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: అభిషేక్ శర్మ
SRH పూర్తి జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్‌విర్‌సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వానిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.