Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH playing XI: అతనిపై వేటు..పంజాబ్‌తో ఆడే తుదిజట్టు ఇదే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో రేపు తలపడనుంది. సీఎస్కేను చిత్తు చేసి విజయోత్సహంతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే సన్‌రైజర్స్‌ను ఓ విషయం కలవరపెడుతోంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ రెండు విజయలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కూడా నమోదు చేసింది. అయితే ఎస్ఆర్‌హెచ్ గెలిచిన రెండు మ్యాచ్‌లు సొంతమైదానంలో ఆడినవే. హెమ్ గ్రౌండ్‌ ఉప్ప‌ల్‌లో చెలరేగుతున్న సన్‌రైజర్స్ ప్రత్యర్థి మైదానంలో విఫలమవుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

SRH Playing XI disappoint to Mayank Agarwal and Glenn Phillips this is the SRH final team to play against Punjab Kings

ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌పై సన్‌రైజర్స్ ప్రత్యేక దృష్టిసారింది. హోమ్ గ్రౌండ్ కాకపోయినా విక్టరీ సాధించాలని కసిగా ప్రణాళికలు రచిస్తోంది. జట్టుకూర్పు విషయంలో స్పెషల్ ఫోకస్ చేస్తోంది. తుదిజట్టులో ముగ్గురు విదేశీ ప్లేయర్లతోనే బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్‌ను తీసుకురావాలని చూస్తోంది.

అలాగే మయాంక్ అగర్వాల్‌, గ్లెన్ ఫిలిప్స్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలనుకుంటుంది. మార్క్‌రమ్‌ రాణిస్తుండటంతో గ్లెన్ ఫిలిప్స్‌‌కు అవకాశాలు దక్కట్లేదు. అయితే రేపటి మ్యాచ్‌లో ఫిలిప్స్‌ను సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఎంపిక చేసి అతని ఫీల్డింగ్ సేవలు ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

హిస్టరీలో హైదరాబాద్ టాప్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఎస్‌ఆర్‌హెచ్ 14 సార్లు, పంజాబ్ 7 సార్లు విజయం సాధించాయి. కాగా, రేపు జరగనున్న ముల్లాన్‌పూర్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో అదే వేదికగా ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఛేజింగ్ పంజాబ్ గెలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: ట్రావిస్ హెడ్.

Story first published: Monday, April 8, 2024, 13:42 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+