Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: జట్టు నిండా రాక్షసులే.. ప్రత్యర్థి జట్లు వణికిపోయేలా సన్‌రైజర్స్!

ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్‌ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే గత సీజన్‌లో తృటిలో టైటిల్‌ను చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ఏడుగురు విదేశీ ప్లేయర్లతో సహా 20 మంది నాణ్యమైన ప్లేయర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టును నిర్మించుకుంది. గత కొంతకాలంగా ఫ్రాంచైజీకీ గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ వాళ్ల స్థానంలో మహ్మద్ షమి, హర్షల్ పటేల్‌ను ఎంపిక చేసింది. ఇక గత సీజన్‌లో ఫైనల్స్‌కు చేరడానికి ప్రధాన కారణమైన పవర్‌ఫుల్ లైనప్ బ్యాటింగ్ మంత్రాన్ని మరోసారి కొనసాగించడానికి సిద్ధమైంది. ఈ తరహాలోనే వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసింది.

SRH Playing XI A Power-Packed Squad Ready to Dominate IPL 2025

విధ్వంసక బ్యాటర్-వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్‌లో విఫలమైన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్‌ను దక్కించుకుంది. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లతో పాటు ఇషాన్ కిషన్, అభినవ్‌లతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అరవీర భయంకరంగా మారింది. వీళ్లతో పాటు సచిన్ బేబీ, అనికేత్ వర్మ కూడా తోడవ్వడం.. ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకుపుట్టించేలా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తయారైంది.

గత సీజన్‌లోని లోపాలతో అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను సన్‌రైజర్స్ ఈసారి దక్కించుకుంది. వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువగా దృష్టి సారించింది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను తీసుకుంది. అంతేగాక ఐపీఎల్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లు కామిందు మెండిస్, బ్రిడన్ కార్స్, ఇషాన్ మలింగలను తక్కువ ధరకే సొంతం చేసుకుని బ్యాకప్ ప్లేయర్లతో జట్టును మరింత పటిష్టంగా చేసింది.

ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, సచిన్ బేబి/అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమి
ఇంపాక్ట్ ప్లేయర్- ఆడమ్ జంపా

సన్‌రైజర్స్ హైదరాబాద్‌
హెన్రిచ్ క్లాసెన్‌ (23), ప్యాట్ కమిన్స్‌ (18), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌ (14), ఇషాన్‌ కిషన్‌ (11.25), మహ్మద్ షమి (10), హర్షల్‌ పటేల్ (8), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (6), అభినవ్ మనోహర్, రాహుల్‌ చాహర్‌ (3.20), ఆడమ్ జంపా (2.40), సిమర్‌జీత్‌ (1.50), ఇషాన్‌ మలింగ (1.20), కార్స్, ఉనద్కత్‌ (1), కమిందు (0.75), జీషన్‌ (0.40), సచిన్‌ బేబీ, అనికేత్, అథర్వ (0.30)

Story first published: Tuesday, November 26, 2024, 9:59 [IST]
Other articles published on Nov 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+