Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: టాప్-2పై గురి.. పంజాబ్‌తో ఆడే తుదిజట్టు ఇదే

ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2లో చోటు సంపాదించాలని ఎస్‌ఆర్‌హెచ్ కసిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు కీలక ఆటగాళ్లు దూరమై బలహీనంగా ఉన్న పంజాబ్ కింగ్స్ గెలుపుతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.

15 పాయింట్లు సాధించి ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ టాప్-2లో నిలవాలంటే పంజాబ్‌పై నెగ్గడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంది. క్వాలిఫయిర్-1కు ఎస్‌ఆర్‌హెచ్ అర్హత సాధించాలంటే రేపు జరగనున్న మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పక విజయం సాధించాలి. కేకేఆర్ (19), రాజస్థాన్ (16) కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే.

SRH Playing 11 vs PBKS Sunrisers Hyderabad Aim to Beat Punjab Kings and Secure Top-2 Spot

టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయిర్-1కు చేరుకుంటాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయిర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో పోటీపడుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. ఇక క్వాలిఫయిర్-1, క్వాలిఫయిర్-2లో గెలిచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. అందుకే టాప్-2‌‌లో స్థానం కోసం ఎస్‌ఆర్‌హెచ్ గురిపెట్టింది.

అయితే రేపటి మ్యాచ్‌‌లో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతి ఇవ్వాలని సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌కు రేపటి నామమాత్రపు మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే, తర్వాత జరగనున్న కీలక మ్యాచ్‌ల్లో ప్రభావం చూపుతాడని భావిస్తోంది. అలాగే మయాంక్ అగర్వాల్‌, ఉమ్రాన్ మాలిక్‌, వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో స్థానం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. భువీ స్థానంలో ఉమ్రాన్, సన్వీర్ సింగ్‌‌ స్థానంలో మయాంక్‌, షాబాజ్ అహ్మద్‌కు బదులుగా సుందర్‌ను తీసుకోవాలని యోచిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, విజయ్‌కాంత్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్.

Story first published: Saturday, May 18, 2024, 15:37 [IST]
Other articles published on May 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+