Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing 11: భారత కుర్రాడిపై వేటు.. ముంబైతో ఆడే తుదిజట్టు ఇదే

ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా రేపు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉండాలంటే సన్‌రైజర్స్ తప్పక విజయం సాధించాల్సిందే. ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ ఆరింట్లో గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచి ఉత్సాహంతో ఉన్న హైదరాబాద్.. ముంబైపై కూడా ఆధిపత్యం చెలాయించి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. సెమీస్‌కు క్వాలిఫై కావడం అసాధ్యం కాబట్టి, ముంబై స్వేచ్ఛగా అత్యుత్త ఆటను ప్రదర్శించే అవకాశాలూ ఉంటాయి. అంతేగాక సొంతమైదానంలో ఆడటం ముంబైకు కలిసొచ్చే అంశం.

SRH Playing 11 vs Mumbai Indians Mayank Agarwal likely to replace Anmolpreet Singh

ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలతో ముంబై ఇండియన్స్ ఓడించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. వాంఖడే వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు ఆశించినంతగా అనుకూలించలేదు. పరుగులు చేయడానికి కేకేఆర్, ముంబై జట్లు తీవ్రంగా శ్రమించాయి. దీంతో జట్టులోకి అనుభవజ్ఞులను తీసుకురావాలని ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అన్మోల్‌ప్రీత్ సింగ్‌‌పై వేటు వేయాలని యోచిస్తోంది.అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.

కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 22 సార్లు తలపడ్డాయి. పది మ్యాచ్‌ల్లో హైదరాబాద్, మిగిలిన 12 మ్యాచ్‌ల్లో ముంబై గెలిచింది. అయితే ఈ సీజన్‌లో తలపడిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయి. 523 పరుగులు నమోదైన ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్/అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జేన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్

Story first published: Sunday, May 5, 2024, 15:40 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+