
డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టడంతో..
మాజీ కేప్టెన్, డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట పక్కన పెట్టడంపై ఇప్పటికే విమర్శల దుమారం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. వార్నర్ ఫామ్‌ను కోల్పోయాడనే కారణంతో అతణ్ని తుది జట్టులోకి తీసుకోవట్లేదు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా జట్టు ఇన్నింగ్‌ను ఆరంభిస్తున్నారు. ఇదే సంప్రదాయం ఈ సాయంత్రం నాటి మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశాలు దాదాపుగా లేవనే అనుకోవచ్చు.

ఫేర్‌వెల్ మ్యాచ్..
ఈ మ్యాచ్ తరువాత డేవిడ్ వార్నర్.. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కనిపించకపోవచ్చు. తాను ఈ జట్టులో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేవంటూ కొద్దిరోజుల కిందటే అతను ధృవీకరించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇక తాను గ్రౌండ్‌లో కనిపించబోనని చెప్పుకొచ్చాడు. అదే జరిగితే- డేవిడ్ వార్నర్ ఈ ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్‌ను ఎప్పుడో ఆడేసినట్టే అవుతుంది. లేదా- ఇంకో మ్యాచ్ మిగిలే ఉన్నందున.. వార్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలకడానికి అతన్ని తుదిజట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది.

రాయల్స్‌పై గెలుపు..ఒక ముంబైపై పంజా
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ టోర్నమెంట్‌లో పార్టీ స్పాయిలర్ రోల్‌ను పోషిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది. ఇది రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. ఇప్పటికే కోహ్లీసేన ప్లేఆఫ్స్ ఎంట్రీ దాదాపుగా ఖాయమైంది. పైగా ఇంకో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్.. తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స, ముంబై ఇండియన్స్ ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఎలాంటి ప్రభావం ఉండదు. విజయంతో సిరీస్‌ను ముగించామనే తృప్తి తప్ప.

మార్పులుంటాయా?
ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు ఏవీ ఉండకపోవచ్చు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగినందున.. ఆ జట్టు నిరాశలో కూరుకుపోయింది. చిట్టచివరి మ్యాచ్‌లో గెలిచి.. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. ఇప్పుడు ఉన్న ఆటగాళ్లతోనే లీగ్ దశను ముగించడానికే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ దఫా కూడా టైటిల్‌ను గెలవాలనే వ్యూహంతో సీజన్ ఆరంభించినా.. అంచనాలకు తలకిందులు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమించనుంది.

హెడ్ టు హెడ్..
ఐపీఎల్ సీజన్లలో ఇప్పటిదాకా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ 17 సార్లు తలపడ్డాయి. ఎనిమిదిసార్లు సన్‌రైజర్స్ విజయం సాధించింది. మిగిలిన తొమ్మిది సార్లు ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో ముంబైదే ఆధిపత్యం.. నాలుగు సార్లు రోహిత్ సేన.. ఒక్కసారి మాత్రమే హైదరాబాద్ గెలవగలిగింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విడతలో ఈ రెండు జట్లు పోటీ పడగా.. ముంబై ఇండియన్స్ జయ కేతనాన్ని ఎగరవేసింది.

హైదరాబాద్, ముంబై తుదిజట్లు ఇలా ఉండొచ్చు..
సన్‌రైజర్స్ టీమ్‌లో జేసన్ రాయ్, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్) లేదా డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ (కేప్టెన్), ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మలిక్ ఉంటారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ (కేప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, కీరన్ పొల్లార్డ్, జిమ్మీ నీషమ్, జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్ నీల్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో ఆడొచ్చు.


Click it and Unblock the Notifications
