
ఆ చేదు జ్ఞాపకాలకు..
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. అంచనాలకు మించిన స్థాయిలో సత్తా చాటుతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉందీ టీమ్. ప్లే ఆఫ్ ముంగిట్లో నిలిచింది. సన్‌రైజర్స్‌పై మ్యాచ్ గెలిస్తే.. దర్జాగా ప్లే ఆఫ్ ఎంట్రీ ఇస్తుంది. ప్లే ఆఫ్స్‌లో ప్రవేశించిన మొట్టమొదటి జట్టుగా నిలుస్తుంది. గత సీజన్‌లో ఇదే ఎమిరేట్స్ గడ్డ మీద ఎదుర్కొన్న అవమానకర పరాజయాల చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోగలుగుతుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లే ఆఫ్ చేరకుండా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొట్టమొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్సే.

ప్లే ఆఫ్ ముంగింట్లో..
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ముంగిట్లో నిలిచింది. చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింట్లో అద్వితీయ విజయాలను అందుకుంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లను ఆడిన ధోనీ సేన రెండింట్లో మాత్రమే ఓడింది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాను ఆడిన చివరి మూడు మ్యాచులనూ గెలుచుకుంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టు అవుతుంది.

భిన్నంగా సన్‌రైజర్స్
చెన్నై సూపర్ కింగ్స్‌కు పూర్తి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది సన్‌రైజర్స్. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఐపీఎల్ 2021 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్టే. ఆ తరువాతి మ్యాచ్‌లల్లో గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. గెలిచి తీరాల్సిన మ్యాచ్.. లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది. గెలిస్తే. ప్లే ఆఫ్స్ ఆశలు మరింత చిగురిస్తాయి. అవకాశాలు మరింత మెరుగు పడతాయి. ఓడితే మాత్రం వెనుదిరగాల్సిందే. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించనున్న మొదటి జట్టుగా సన్‌రైజర్స్ చెడ్డ పేరు తెచ్చుకుంటుంది.

అట్టడుగు స్థానంలో..
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలోనే కొనసాగుతోంది. 10 మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి నాలుగు పాయింట్లే. తన తాజా మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించడం ఆ జట్టును ఇంకా సజీవంగా నిలిపింది. ప్లేఆఫ్ దశకు వెళ్లే అవకాశాలను కాస్త మెరుగు పరిచింది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే.. ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలను మరింత బలోపేతం చేసుకోగలుగుతుంది ఆరెంజ్ టీమ్. అన్ని విధాలుగా తనకంటే బలమైన జట్టును ఎలా నిలువరించగలుగుతుందనేది ఆసక్తిగా మారింది.

హైదరాబాద్ జట్టు కూర్పు ఎలా ఉండొచ్చు..
అగ్నిపరీక్షలా మారిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. డేవిడ్ వార్నర్ యధాతథంగా డగౌట్‌కే పరిమితం అవుతాడనే అంటున్నారు. జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా జట్టు ఇన్నింగ్‌ను ఆరంభిస్తారు. టాప్ ఆర్డర్‌లో కేప్టెన్ కేన్ విలియమ్సన్, మిడిల్ ఆర్డర్‌లో ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ కొనసాగుతారు. లోయర్ ఆర్డర్‌లో అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ ఉంటారు. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో జేసన్ రాయ్, కేన్ విలియమ్సన్ ఇద్దరే జట్టును విజయ తీరాలకు చేర్చారు. అదే దూకుడు చెన్నై పైనా చూపిస్తే.. మరో విజయం ఖాయమౌతుంది.


Click it and Unblock the Notifications












