Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Umran Malik: ఇదేం స్పీడ్‌రా నాయనా..! ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ స్పీడ్ బౌలింగ్

Umran MaliK is the Indian player with the fastest delivery in IPL history,

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2022లో తుఫాను ప్లేయర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను క్రికెట్ మాజీలు పేర్కొంటున్నారు. అతను టీమిండియాలో చేరాల్సిన ప్లేయర్ అని, టీ20 ప్రపంచ‌కప్‌లో అతన్ని టీమిండియా తరఫున ఆడించాలంటూ చాలా మంది క్రికెట్ ప్రముఖులు తమ అభిప్రాయాలను పేర్కొంటున్నారు. ఈ సీజన్లో వెలుగుచూసిన సూపర్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తన ఫాస్టెస్ట్ డెలివరీలతో బ్యాటర్లను బెంబేలెత్తించే ఉమ్రాన్ మాలిక్ గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా వేగవంతమైన బంతులతో బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓడిపోయి వరుసగా మూడో పరాజయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ తన థండర్‌బోల్ట్ డెలివరీతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన టైలో ఐపీఎల్ హిస్టరీలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.

అత్యధిక వేగవంతమైన ఇండియన్ బౌలర్

ఇక విషయానికొస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ బంతిని అందుకున్నాడు. క్రీజులో ఢిల్లీ స్టార్ ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెల్‌ ఉన్నాడు. చివరి ఓవర్ నాలుగో బంతిని ఉమ్రాన్ ఫుల్లర్ డెలివరీని వేశాడు. ఈ బంతి వేగం 157kmphగా నమోదైంది. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ ఇదే. ఈ సీజన్లో అంతకుముందు అత్యంత వేగవంతమైన డెలివరీ 156kmph రికార్డు కూడా ఉమ్రాన్ మాలిక్ పేరిటే ఉంది. దీంతో తన రికార్డును తానే బద్ధలు కొట్టాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక భారత ప్లేయర్ వేసిన అత్యంత వేగవంతమైన డెలివరీగా రికార్డ్‌లకెక్కింది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డెలివరీల విషయంలో 157.3kmph వేగంతో ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ షాన్ టైట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో 157kmphతో రెండో స్థానంలో మాలిక్ ఉన్నాడు. అలాగే తాజా డెలివరీతో మాలిక్ 1997లో దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత గ్రేట్ జవగల్ శ్రీనాథ్ 157కి.మీ రికార్డును సమం చేశాడు.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో వికెట్లేం తీయకుండానే

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో వికెట్లేం తీయకుండానే

అంత వేగంతో వేసిన బంతిని కూడా క్రీజులో ఉన్న రోవ్‌మాన్ పావెల్ ధాటిగా ఎదుర్కొని బౌండరీ ద్వారా బదులిచ్చాడు. ఎక్స్‌ ట్రా కవర్, మిడ్-ఆఫ్ మధ్య గ్యాప్‌లో ఫోర్ బాదాడు. అద్భుతమైన రికార్డు సాధించినప్పటికీ ఉమ్రాన్ ఈ మ్యాచ్‌‌లో ఒక్క వికెట్ తీయకుండానే ముగించాడు. ఇక మాలిక్ తన నాలుగు ఓవర్లలో 52పరుగులు ఇచ్చాడు. గత నెలలో వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసిన తర్వాత అతను వరుసగా రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే భారీగా పరుగులు కూడా ఇచ్చేస్తున్నాడు. అంతకుముందు పూణెలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో వికెట్ లేకుండా 48పరుగులు ఇచ్చాడు.

ఈ ఐపీఎల్లో వెలుగుచూసిన ఉత్తమ ప్లేయర్

ఈ ఐపీఎల్లో వెలుగుచూసిన ఉత్తమ ప్లేయర్

ఇక ఈ మ్యాచ్ విజయానికొస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువీ, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్లో వెలుగుచూసిన మంచి ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ అని పేర్కొన్నాడు.

Story first published: Friday, May 6, 2022, 9:42 [IST]
Other articles published on May 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+