SRH ఓనర్ కావ్య మారన్ పక్కన ఉన్న 'మిస్ట‌రీ గ‌ర్ల్' ఎవ‌రో తెలుసా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు బోణీ కొట్టకపోయినా.. ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ మాత్రం అందర్ని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ తన హవభావాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినిమా హీరోయిన్ తలపించేలా ఉన్న 29 ఏళ్ల కావ్య మారన్.. ప్రతీ మ్యాచ్‌లో తన అందచందాలతో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు. ఆమె ఎంతలా పాపులరయ్యారంటే.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా కావ్య ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్.. మీమ్స్‌లా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆమె పక్కనే ఉంటు జట్టుకు మద్దతు తెలుపుతున్న మరో మిస్టరీ గర్ల్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అసలు ఆమె ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌ను కూడా ఖాళీ మైదానాల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ అధికారులు, బీసీసీఐ పెద్దలు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మినహా ఎవరికీ మైదానాల్లోకి అనుమతి లేదు. వీళ్లు కూడా ఆటగాళ్లలానే కఠిన బయో బబుల్‌లో ఉండాలి. అయితే సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతునప్పుడల్లా టీవీ కెమెరాలు కావ్య మారన్‌తో పాటు ఆమె పక్కనే కూర్చునే మరో బ్యూటీని పదే పదే చూపిస్తున్నాయి. ఆమె హవాభావాలనే పదే పదే క్యాప్ఛర్ చేస్తున్నాయి. బ్యాట్స్‌మెన్ బౌండరీ బాదినప్పుడుల్లా.. ఆమె ఊపే జెండా.. వికెట్ పోయినప్పుడు నిరాశకు గురయ్యే సీన్స్‌ను చూపిస్తున్నాయి. దీంతో ఈ మిస్టరీ గర్ల్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె ఎవరా? అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.

కొందరు కావ్య మారన్ కజిన్ సిస్టర్ అంటే.. మరికొందరు ఫ్రాంచైజీకి చెందిన సన్నిహితురాలని కామెంట్ చేస్తున్నారు. ఏదీఏమైనప్పటికి ప్రస్తుతం కావ్యమారన్‌తో పాటు ఈ మిస్టిరీ బ్యూటీ కూడా సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ సంపాదించారు. ఎంతలా అంటే కనీసం ఈ ముద్దుగుమ్మల కోసమైనా మ్యాచ్ గెలవండయ్యా? అని సన్‌రైజర్స్ ఆటగాళ్లను అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 13 మ్యాచ్‌ల్లో ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప మిగిలిన జట్లన్నీ బోణీ కొట్టాయి. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. ఆరంభంలో దంచికొట్టడం.. లక్ష్యంవైపు సాఫీగా సాగుతున్నట్లు కనిపించడం.. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలి ఓటమిని ఆహ్వానించడం..ఆరెంజ్ ఆర్మీకి అలవాటైపోయింది. ఈ క్రమంలోనే వార్నర్ సేన.. మరో ఆసక్తికర సమరానికి సిద్దమవుతోంది. నేడు(బుధవారం) జరిగే డబుల్ హెడర్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఫస్ట్ మ్యాచ్‌లో తమ కంటే కాస్త మెరుగ్గా ఉన్న పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ తలపడుతోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 21, 2021, 12:15 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X