Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య పాప సంచలన ఆరోపణలు.. యాక్షన్‌లోకి బీసీసీఐ!

ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసినప్పటికీ.. దానికి సంబంధించిన వివాదాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్‌పై ఎస్ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కృనాల్ పాండ్యా బౌలింగ్ వేసేటప్పుడు 'చకింగ్' చేస్తున్నాడంటూ కావ్య మారన్ ఆరోపించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లను అడ్డుకోవడానికి స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఈ మధ్యకాలంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. క్రీజును పూర్తిగా వాడుకుంటూ బౌన్సర్లు, యార్కర్లతో బ్యాటర్లను బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. మే 22న సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి కృనాల్ పాండ్యా తన అస్త్రాలన్నింటినీ ఉపయోగించాడు. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి నితీష్ కుమార్ రెడ్డికి కృనాల్ పాండ్యా ఓ వేగవంతమైన బౌన్సర్ విసిరాడు. స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న కావ్య మారన్.. ఆ బంతి పడిన వేగాన్ని చూసి కృనాల్ పాండ్యా చేతిని వంచి 'చకింగ్' చేస్తున్నాడంటూ పక్కనే ఉన్న వారితో సైగలు చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

SRH Owner Kavya Maran Accuses Krunal Pandya of Chucking Will BCCI Take Action Full Details

ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంతసేపు కృనాల్ పాండ్యాకు బౌలింగ్ ఇవ్వలేదు. విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ క్రీజులోకి వచ్చాకే బంతిని కృనాల్ పాండ్యా చేతికి అప్పగించాడు. తన మొదటి ఓవర్లో ఒక సిక్స్ బాదినప్పటికీ.. క్లాసెన్‌ను కట్టడి చేస్తూ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన కృనాల్ పాండ్యా.. అదే ఓవర్ రెండో బంతికి క్లాసెన్ (51) వికెట్ పడగొట్టాడు. అయితే అదే ఓవర్లో నితీష్ రెడ్డి వరుసగా రెండు సిక్సర్లు బాదగా.. చివరి బంతికి కృనాల్ వేసిన విచిత్రమైన డెలివరీపైనే కావ్య మారన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 255 పరుగుల భారీ స్కోరు సాధించి.. ఆర్సీబీని 55 పరుగుల తేడాతో ఓడించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం క్వాలిఫైయర్-1కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. ఆర్సీబీ తరపున రజత్ పాటిదార్ (56), వెంకటేష్ అయ్యర్ (44), కృనాల్ పాండ్యా (41 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 200 పరుగుల మార్కును దాటి నెట్ రన్ రేట్ దెబ్బతినకుండా చూసుకుంది. మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచినప్పటికీ, నెట్టింట మాత్రం కావ్య మారన్ హావభావాలు, కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ వివాదమే హైలైట్‌గా నిలిచింది.

Story first published: Saturday, May 23, 2026, 12:22 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+