SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది.. మా కావ్య పాప నవ్విందోచ్!

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టింది. ఇప్పటికే లీగ్ 8 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో చిట్ట చివరన నిలిచిన ఆరెంజ్ ఆర్మీ..
రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. వరుస పరాజయాలతో చికాకుకు గురైన హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు.. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సైతం సంతోషం వ్యక్తం చేసింది.

కావ్య పాప నవ్వింది..

ఇన్నాళ్లు సన్‌రైజర్స్ వరుస ఓటములతో మూడాఫ్‌గా కూర్చున్న కావ్య.. ఈ రోజు ఎగిరి గంతేసింది. మ్యాచ్ ఆసాంతం చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో ప్రతీ బంతిని ఎంజాయ్ చేసింది. జాసన్ రాయ్ జోరు.. కేన్ మామ క్లాస్ ఇన్నింగ్స్‌లను ఆస్వాదించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా 'ఇన్నాళ్లకు మా కావ్యపాప నవ్విందోచ్'అంటూ కామెంట్ చేస్తున్నారు. 'ఇంతకన్నా మాకేం కావాలి?'అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కావ్య ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా..

కావ్య ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా..

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నా కావ్య మారనే ప్రేక్షకులను అలరించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ మ్యాచ్‌కు హాజరైన కావ్య తన హవాభావాలతో ప్రేక్షకులను అలరించింది. ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మెన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆమె హవాభావాలన్నీ మీమ్స్‌గా నెట్టింట గత కొన్నాళ్లుగా హల్‌చల్ చేస్తున్నాయి.

వేల కోట్ల వారసురాలు..

వేల కోట్ల వారసురాలు..

సినీ హీరోయిన్‌ను తలపించే లుక్‌తో ఇంతటి పాపులారిటీ సంబంధించిన కావ్య మారన్.. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల కూతురు. బిజినెస్ మీద ఆసక్తితో కావ్య ఎంబీఏ చేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. దాంతో తన తండ్రి బిజినెస్‌ల్లోని సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ను చూసుకుంటుంది. త్వరలో సన్‌గ్రూప్‌ను టేకప్ చేయబోతుంది. సన్‌గ్రూప్‌లో జెమీనీతో పాటు అనేక భాషల్లో చాలా చానెళ్లు ఉన్నాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినదే. రెడ్ ఎఫ్‌ఎంతో పాటు ఇండియా మొత్తం 70 రెడియా స్టేషన్లు ఉన్నాయి.

రోబో సినిమా నిర్మించిన సన్ పిక్ఛర్ ప్రొడక్షన్స్, సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినవే. స్పైస్ జెట్‌లో కూడా 40 శాతం వాటా ఉండేది. కానీ ఆ వాటాను స్పైస్ జెట్ ఓనర్ అజయ్ సింఘ్‌కేఅమ్మేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. అతని నెట్ వర్త్ 2021 ప్రకారం 2.3 బిలియన్ డార్లుగా ఉంటుందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ 2.3 బిలియర్ డాలర్ల ఆస్థికి ఏకైక వారసురాలు కావ్యమారనే.

జాసన్ భాయ్ మాస్.. కేన్ మామ క్లాస్..

జాసన్ భాయ్ మాస్.. కేన్ మామ క్లాస్..

తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీకి తోడుగా యశస్వీ జైస్వాల్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36), మహిపాల్ లోమ్‌రోర్(28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరగులు చేసింది. జాసన్ రాయ్(42 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 60), కెప్టెన్ కేన్ విలియమ్సన్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్, మహిపాల్ లోమ్రార్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 27, 2021, 23:49 [IST]
Other articles published on Sep 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X