Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ఐ విల్‌ బి బ్యాక్‌.. సన్‌రైజర్స్‌కు శుభవార్త చెప్పిన స్టార్ ప్లేయర్! ఆనందంలో ఫాన్స్!!

SRH openar David Warner to play IPL 2021 Phase 2 in UAE

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌ఎచ్) అభిమానులకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శుభవార్త అందించాడు. సెప్టెంబర్‌19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు తాను అందుబాటులోకి వస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. 'ఐ విల్‌ బి బ్యాక్‌' అంటూ వార్నర్‌ కామెంట్‌ చేశాడు. దీంతో ఎస్ఆర్‌ఎచ్ ఫాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు.

డ్రింక్స్‌ అందించడంపైనా:

డ్రింక్స్‌ అందించడంపైనా:

ఐపీఎల్‌ 2021 సీజన్‌ వాయిదా పడడానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి న్యూజీలాండ్ సారథి కేన్‌ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా విలియమ్సన్‌ ఎంపికపై నెటిజన్లు సన్‌రైజర్స్‌ యాజమాన్యంను తప్పుబడుతూ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు. కెప్టెన్‌ పదవి నుంచి తొలగించడమేగాక తర్వాతి మ్యాచ్‌కు వార్నర్‌ను పక్కనపెట్టారు. ఆ మ్యాచ్‌కు వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించడంపై కూడా పెద్ద వివాదమే చెలరేగింది. ఈ నేపథ్యంలో వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడం ఇదే చివరిసారని వార్తలు వచ్చాయి.

అభిమానుల్లో జోష్‌:

అభిమానుల్లో జోష్‌:

కరోనాతో వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలకు కూడా డేవిడ్ వార్నర్‌ దూరంగా ఉంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్‌ తాను ఐపీఎల్‌ 14వ సీజన్‌ మిగతా మ్యాచులు కూడా ఆడతానని క్లారిటీ ఇచ్చేశాడు. వార్నర్‌ ఐపీఎల్‌ ఆడడంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో జోష్‌ పెరిగింది. కరోనాతో వాయిదా పడిన మిగతా లీగ్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్‌ 15న ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఢిల్లీ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

వార్నర్‌ కెప్టెన్సీలోనే టైటిల్‌:

వార్నర్‌ కెప్టెన్సీలోనే టైటిల్‌:

2012లో డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్‌ సామి, శిఖర్‌ ధావన్‌, కామెరున్‌ వైట్‌ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో డేవిడ్‌ వార్నర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత సన్‌రైజర్స్‌ తలరాత మారిపోయింది. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ అందుకుంది. ఆ సీజన్‌లో వార్నర్‌ బ్యాటింగ్‌లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్‌ను అందించాడు. అప్పటినుంచి 2018 సీజన్‌ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌గా పనిచేసిన వార్నర్‌ ప్రతీసారి ఫ్లేఆఫ్‌కు తీసుకురావడం విశేషం.

కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ:

కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ:

ఇక బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేదం ఎదుర్కొన్న వార్నర్‌ 2018 ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌ కెప్టెన్‌గా పనిచేశాడు. అయితే ఆ ఏడాది విలియమ్సన్‌ అద్బుత కెప్టెన్సీకి తోడూ ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించడంతో ఫైనల్‌కు వచ్చింది. ఫైనల్లో సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌ ఆరంభంలో విలియమ్సన్‌ నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండడం.. వార్నర్‌ కెప్టెన్సీలో విఫలమవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అంతంత ప్రదర్శన నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ మార్పును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం నమోదు చేసింది. గెలిచే మ్యాచులను చేజేతులారా పోగొట్టుకుంది.

Story first published: Tuesday, August 10, 2021, 22:54 [IST]
Other articles published on Aug 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+