
23 మందితో కొత్త జట్టు..
కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని సంపాదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో నలుగురైదుగురు మినహాయిస్తే- మిగిలిన వారందరూ కొత్త ప్లేయర్లే. 23 మందితో జట్టును తయారు చేసుకుందా ఫ్రాంఛైజీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్య మారన్.. తన అడ్మిన్ స్టాఫ్‌తో కలిసి బెంగళూరు వేలంపాటకు హాజరయ్యారు. ప్లేయర్లను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయంలో కొంత విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ- ఏదైతే అదే అయిందంటూ తెగించేశారు.

కేన్ కేప్టెన్సీ ఖాయమే..
23 మందితో రూపుదిద్దుకున్న ఈ కొత్త జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వాన్ని వహించడం దాదాపు ఖాయమైనట్టే. ఆ స్థాయి అనుభవం ఉన్న క్రికెటర్ మరొకరు లేరు. వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్‌ను వైస్ కేప్టెన్‌గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం పూరన్.. తన దేశ జాతీయ జట్టు వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మట్‌కు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఆ అనుభవం ఉన్నందున కేన్‌కు తోడుగా వైస్ కేప్టెన్సీ బాధ్యతలను అప్పగించొచ్చు.

విదేశీ కోటా ఫుల్..
తన జట్టులో విదేశీ కోటాను భర్తీ చేసుకుంది సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ. ఎనిమిది మందికి ఎనిమిది మందినీ తీసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్‌ను ఇదివరకే రిటైన్ చేసుకోగా.. రెండురోజుల వేలంపాట సందర్భంగా మిగిలిన ఏడుమందినీ జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్‌కే చెందిన గ్లెన్ ఫిలిప్స్‌ను బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కోటాలో సెలెక్ట్ చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ కీలక బ్యాటర్‌గా మారే అవకాశం ఉంది.

ఆల్‌రౌండర్ కోటాలో షెప్పర్డ్
వెస్టిండీస్‌కు చెందిన రొమారియో షెప్పర్డ్‌ను ఆల్‌రౌండర్ల కోటాలోకి తీసుకుంది. అతని కోసం 7 కోట్ల 74 లక్షల రూపాయలను వ్యయం చేసింది సన్‌రైజర్స్. అదే కోటాలో దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జెన్‌సెన్‌ను 4 కోట్ల 20 లక్షల రూపాయలతో జట్టులో చోటు కల్పించింది. ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబాట్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఫజల్ హక్ ఫారూఖీని బౌలర్లుగా ఎంపిక చేసింది. 50 లక్షల రూపాయలకు అతన్ని ఎంపిక చేశారు కావ్య మారన్.

కోటాలివే..
కేన్ విలియమ్సన్, ప్రియంగర్గ్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్‌రమ్, విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, ఆర్ సమర్థ్ బ్యాటర్ల కోటాలో ఎంపికయ్యారు. అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెప్పర్డ్, అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్, మార్కో జెన్‌సెన్ ఆల్‌రౌండర్లుగా సెలెక్ట్ అయ్యారు. ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్, టీ నటరాజన్, జగదీశా సుచిత్, సౌరభ్ దుబే, కార్తీక్ త్యాగి, ఫజల్ హక్ ఫారూఖీ బౌలర్లు.

బ్యాటర్ల కంటే.. బౌలర్లే
ఆల్‌రౌండర్లను వదిలేస్తే.. బ్యాటర్ల కంటే బౌలర్ల సంఖ్యే ఎక్కువగా కనిపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో. ఎనిమిది మంది బ్యాటర్లు కాగా.. తొమ్మిది మంది బౌలర్లే ఉన్నారు. ఇది కాస్తా కేన్ విలియమ్సన్ సత్తాకు అగ్నిపరీక్షగా మారొచ్చు. బ్యాటింగ్ వనరులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో- బౌలర్ల మీద ఆధారపడి మ్యాచ్‌ను గెలిపించే పరిస్థితులు ఐపీఎల్ 2022 టోర్నమెంట్ మ్యాచ్‌లల్లో సాక్షాత్కరించదనడానికి గ్యారంటీ లేదు. వేలంపాట ముగిసిన తరువాత 10 లక్షల రూపాయలు సన్‌రైజర్స్ అకౌంట్‌లో మిగిలాయి.


Click it and Unblock the Notifications
