Cancel IPL:ప్లీజ్.. ఐపీఎల్ 2021ని రద్దు చేయండి! బీసీసీఐని కోరుతున్న ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్! ఎందుకో తెలుసా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి కరోనా వైరస్ సెగ తాకినట్లే కనబడుతోంది. పటిష్ట బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ 14వ సీజన్‌ను నిర్వహిస్తున్నా.. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆ జట్టంతా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఈ రోజు (మే 3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తెలియదు. కేకేఆర్ జట్టులో కరోనా కేసులు ఉన్న విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటేతర సిబ్బంది ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. దీంతో చెన్నై ఉన్నపళంగా తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఆరంభానికి ముందే షాక్:
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుండగానే బయో సెక్యూర్ బబుల్‌లో ఐపీఎల్ 2021ను విజయవంతంగా నిర్వహించాలని బీసీసీఐ టోర్నీ ఆరంభానికి ముందే నిర్ణయించింది. అయితే టోర్నీ ఆరంభానికి ముందే నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. ఆరంభంలో ముంబై మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితీశ్ రాణా వంటి ఆటగాళ్లూ కూడా పాజిటివ్‌గా తేలారు. అయినప్పటికీ ఐపీఎల్ పాలక మండలి టోర్నీని కొనసాగించేందుకే మొగ్గు చూపింది.
బీసీసీఐపై ఒత్తిడి:
ఇక ఐపీఎల్ 2021 ప్రారంభమై 25 రోజులు అవుతోంది. ఇప్పటికే సగం టోర్నీ ముగియగా.. బయో బుడగ పటిష్ఠంగానే ఉండటంతో బీసీసీఐ బోర్డు ఊపిరి పీల్చుకుంది. అయితే ఉన్నపళంగా ఆటగాళ్లు కరోనా బారినపడడంతో.. ఈరోజు బెంగళూరు, కోల్‌కతా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఇక మైదాన సిబ్బందికి కరోనా సోకడంతో మంగళవారం ఢిల్లీలో జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా లేదా రద్దు చేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణను చాలా మంది తప్పబడుతున్నారు.
Cancel IPL:
ఐపీఎల్ 2021ను వెంటనే రద్దు చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాన్స్. 'Cancel IPL' అనే హ్యాష్ ట్యాగ్‌తో మీమ్స్, సెటైర్లు, కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. 'ప్లీజ్.. ఐపీఎల్ 2021ని రద్దు చేయండి', 'ఇదే సరైన సమయం.. ఐపీఎల్ టోర్నీని క్యాన్సెల్ చేయండి', 'ఐపీఎల్ మేనేజ్మెంట్ టోర్నీని రద్దు చేస్తుంది.. మన సన్‌రైజర్స్ బచాయించింది పో', 'ఐపీఎల్ 2021ని రద్దు చేయండి.. పట్టికలో చివరిలో ఉన్న జట్టుకు కప్ ఇవ్వండి', 'ఆటగాళ్లకు కరోనా వస్తుంటే.. ఐపీఎల్ మ్యాచులు పెట్టుడు ఏంది సర్' అంటూ కామెంట్లు చేటున్నారు.
ప్లేఆఫ్స్ కష్టం కాబట్టే:
సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు 'Cancel IPL' అనే హ్యాష్ ట్యాగ్‌ను చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఐపీఎల్ 2021లో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్.. ఒకే ఒక్క విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సన్‌రైజర్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. ఆడబోయే ఏడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఆరు గెలిచినా.. మిగతా జట్ల విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ఐపీఎల్ 2021ని రద్దు చేయాలని బీసీసీఐని ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications