SRH vs PBKS: మీరు నిజంగా ‘జాతి రత్నాలయ్యా’! ఒరే పాండే నీకు రూ. 44 కోట్లు దండుగరా!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే 8 మ్యాచ్‌ల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఇరు జట్లను ఊరించిన విజయం పంజాబ్ కింగ్స్‌ను వరించింది. అయితే ఈ ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 125 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇంత చెత్త‌గా బ్యాటింగ్‌ చేస్తే ఏ మ్యాచ్ గెలవలేమంటున్నారు. వచ్చే సీజన్‌లోనైనా మంచి టీమ్‌తో పాటు మేనేజ్‌మెంట్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

మీరు.. జాతి రత్నాలయ్యా..

పేలవ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారంగా మారిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్‌లు జాతిరత్నాలని సెటైర్లు పేల్చుతున్నారు. వీరిని వీలైనంత త్వరగా క్రికెట్ ఆడకుండా నిషేధించాలని, కనీసం తుది జట్టులో నుంచి తప్పించైనా బెంచ్‌పై కూర్చో బెట్టాలని అభిప్రాయపడుతున్నారు.

వీరి చెత్త బ్యాటింగ్‌ను అభిమానులు తట్టుకోలేరని, ఈ ముగ్గురు ఇంకెప్పుడు ఆడుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురు ఐపీఎల్ ఆడాలంటే ఫ్రాంచైజీలకే డబ్బులివ్వాలని లేకుంటే వీరితో వారికి తీవ్ర నష్టమని కామెంట్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వదులుకున్న కేదార్ జాదవ్‌ను ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. సన్‌రైజర్స్ ఓనర్స్ కూడా తలపట్టుకుంటున్నారని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఓరి పాండే.. రూ.44 కోట్లు!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత నాలుగు సీజన్లుగా ఆడుతున్న మనీశ్ పాండేకు ఫ్రాంచైజీ రూ.44 కోట్లు చెల్లించిందని, అతనికి అంత మొత్తం ఇవ్వడం దండుగని కామెంట్ చేస్తున్నారు. అతని నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని, పాండే ఆడిందేం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏం ఆడకుండా ఉత్తగా రూ.44 కోట్లు తీసుకెళ్లాడని, మెగా వేలంలో అతన్ని ఎవడూ కొనడని కామెంట్ చేస్తున్నారు. వచ్చే సీజన్ కోసం జరిగే వేలంలోనైనా మంచి ఆటగాళ్లను తీసుకోవాలని, ముందుగా టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కూడా మార్చాలని హితవు పలుకుతున్నారు. నిన్నటి మ్యాచ్ చూస్తుంటే సన్‌రైజర్స్ చెత్త జట్టా లేక పంజాబ్? అనే సందేహం కలిగిందని, రెండు టీమ్స్ పేలవ ఆటతో మూడొంతుల మ్యాచ్‌ చప్పగా సాగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వార్నర్ భాయ్ గుడ్‌బై..

ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన డేవిడ్ వార్నర్‌పై కూడా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ కెరీర్ ముగిసిందని, అతని వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో జాసన్ రాయ్‌కు అవకాశం ఇవ్వాలని, జట్టులో చాలా మార్పులు చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఆఖరి బంతికి విజయాన్నందుకున్న పంజాబ్ కింగ్స్‌పై కూడా సెటైర్లు పేలుతున్నాయి. గెలిచే మ్యాచ్‌లో ఓడటం.. ఓడే మ్యాచ్‌లో గెలవడం పంజాబ్ కింగ్స్ నైజమని, నాథన్ ఎల్లిస్ టార్చర్ బేరర్ అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

పంజాబ్ అంటేనే థ్రిల్లర్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 2 ఫోర్లతో 27), కేఎల్ రాహుల్( 21 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్(3/19) పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసింది. జాసన్ హోల్డర్ (29 బంతుల్లో 5 సిక్స్‌లతో 47 నాటౌట్), వృద్దిమాన్ సాహా(37 బంతుల్లో ఫోర్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/14) రెండు వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. లో స్కోరింగ్ గేమ్ అయినా అభిమానులను ఆఖరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 26, 2021, 8:17 [IST]
Other articles published on Sep 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X