Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKBS vs SRH: యాహూ.. మన పొలంలో మొలకలు వచ్చాయ్! ఇక మాములుగా ఉండదు!

SRH Fans reactions after winning On Punjab Kings in IPL 2021

హైదరాబాద్: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు లక్ష్యాన్ని ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది. డేవిడ్‌ వార్నర్‌ (37; 37 బంతుల్లో 3x4, 1x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్‌; 56 బంతుల్లో 3x4, 3x6), కేన్‌ విలియమ్సన్‌ (16 నాటౌట్‌; 19 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఐపీఎల్‌ 2021లో సన్‌రైజర్స్‌ బోణీ కొట్టింది.

మూడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఎట్టకేలకు సూపర్ విక్టరీ కొట్టడంతో ఆ జట్టు ఆటగాళ్లు, యాజమాన్యం సంతోషంలో మునిగిపోయారు. ఇక సన్‌రైజర్స్‌ అభిమానులు అయితే గాల్లో తేలిపోతున్నారు. వార్నర్ సేన గెలిచిన ఆనందంలో సోషల్ మీడియాను ఫాన్స్ షేక్ చేస్తున్నారు. మీమ్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మన పొలంలో మొలకలు వచ్చాయ్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'అవును మనం మ్యాచ్ గెలిచాం' అని మరొకరు ట్వీటారు. 'ఇక మామూలుగా ఉండదు', 'ఇలాంటి విజయమే కదా కావాల్సింది', 'హమ్మయ్య.. బోణీ కొట్టాం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'మనం గెలిచాం' అని సన్‌రైజర్స్‌ కూడా ట్వీట్ చేసింది.

సన్‌రైజర్స్‌ టీమ్ సీఈవో కావ్య మారన్ కూడా చాలా ఆనందంలో ఉన్నారు. సన్‌రైజర్స్‌ విజయం సాధించిన తర్వాత ఆమె ఒక్కసారిగా లేచి నవ్వులు పూయించారు. స్టేడియంలో కావ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'అబ్బా సాయిరాం.. మా 'కావ్య మారన్' పాప నవ్వింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఎట్టకేలకు కావ్య మారన్ ఈరోజు నవ్వింది' అని మరొకరు ట్వీట్ చేశారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్ మంచి ఆరంభం అందించారు. బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై సింగిల్స్, డబుల్స్ తీస్తూనే.. చెత్త బంతుల్ని బౌండరీకి పంపారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కి 10.1 ఓవర్లలోనే 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మ్యాచ్‌ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చేసింది. ఈ దశలో స్పిన్నర్ ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన వార్నర్.. ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కాడు. దీంతో సన్‌రైజర్స్ 73 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.

డేవిడ్ వార్నర్ అనంతరం నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన విలియమ్సన్ (16 నాటౌట్తో కలిసి బెయిర్‌స్టో జట్టును ఆదుకున్నాడు. వార్నర్ ఔట్ తర్వాత కాస్త దూకుడు తగ్గించిన బెయిర్‌స్టో.. హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ టాప్ ‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కేన్.. లక్ష్యం చిన్నదే కావడంతో నెమ్మదిగా ఆడాడు. బెయిర్‌స్టో ఆఖరి వరకూ బాధ్యతాయుతంగా ఆడి హైదరాబాద్‌ని గెలిపించాడు. పంజాబ్ బౌలర్ ఫ్యాబియాన్ అలెన్ ఒక వికెట్ తీశాడు.

Story first published: Wednesday, April 21, 2021, 21:25 [IST]
Other articles published on Apr 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+