టెస్టును తలపించాడు:
చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో (7)ను నాలుగో ఓవర్‌లో సామ్ కరన్ ఔట్ చేశాడు. డేవిడ్ వార్నర్ మరి నిదానంగా ఆడాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ ఒక వికెట్ నష్టానికి 39రన్స్ చేసింది. గత మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మనీశ్ పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడినా.. వార్నర్ మాత్రం టెస్టును తలపించాడు. పాండే 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంటే.. వార్నర్ 50 బంతుల్లో ఆ ఫీట్ అందుకున్నాడు. ఎంగిడి 18వ ఓవర్‌లో వార్నర్, పాండేను ఔట్ చేయగా.. ఆఖర్లో కేన్ విలియమ్సన్ వేగంగా ఆడాడు. శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో కేన్ 4,6,4,4 బాదితే.. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు జాదవ్ (12 నాటౌట్) 4,6 కొట్టడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
వార్నర్ 10 ఓవర్లు మింగేశాడు:
బుధవారం జరిగిన మ్యాచులో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించింది. అలాంటి పిచ్‌పై సన్‌రైజర్స్ చేసింది 171 పరుగులు. ఇందుకు ప్రధాన కారణం డేవిడ్ వార్నర్ (57; 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు). ఎక్కడ వికెట్ కోల్పోతానో అని టెస్టు మ్యాచును తలపించాడు. 55 బంతులు ఆడి 57 రన్స్ చేశాడు. దాదాపు అతడే 10 ఓవర్లు మింగేశాడు. బ్యాటింగ్ పిచ్‌పై హిట్టర్ అయిన వార్నర్ అలా ఆడడం అందరిని ఆశ్చర్యపరిచింది. మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోవడానికి తాను నెమ్మదిగా బ్యాటింగ్ చేయడమే కారణమని వార్నరే స్వయంగా ఒప్పుకున్నాడు.
జట్టుకు భారంగా మారిన శంకర్:
ఇక టీమిండియా ఆటగాడైన విజయ్ శంకర్.. సన్‌రైజర్స్ జట్టుకు భారంగా మారాడు. ఇప్పటికి హైదరాబాద్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో శంకర్‌కు అవకాశం దక్కింది. బౌలింగ్‌లో కొద్దిగా పర్వాలేదనిపించినా.. ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లోనైతే మరీ ఘోరంగా విఫలమై జట్టు ఓటమికి కారణమయ్యాడు. శంకర్ వరుసగా 11, 3, 28, 8 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శంకర్‌కు బ్యాటింగ్ రాలేదు. చెన్నైపై అయితే బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. ఫీల్డింగ్లోనూ పెద్దగా మెరిసింది లేదు. జట్టులో శంకర్ ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అనే పరిస్థితి వచ్చింది.
ఇక దుకాణం సర్దేయండి:
టోర్నీలో ఇంకా 8 మ్యాచులు హైదరాబాద్ ఆడాల్సి ఉంది. మరో రెండు ఓడితే.. ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇక జట్టుకు భారంగా మారిన శంకర్‌పై, డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫన్నీ మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'ఏం ఆట ఆడుతున్నారా నాయనా' అని ఒకరు కామెంట్ చేయగా.. '200+ స్కోర్ పిచ్‌పై 171 పరుగులా చేసేది' అని మరొకరు ట్వీట్ చేశారు. 'ఇక దుకాణం సర్దేయండి', 'ప్లే ఆఫ్స్ ఆశలు లేవు ఇగ', 'ఆ విజయ్ శంకర్ ఏం చేస్తుండు', 'వార్నర్ పూర్ కెప్టెన్సీ', 'శంకర్ జట్టులో ఎందుకు', 'బౌయింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయని శంకర్.. ఎందుకు' అంటూ కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications












