For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: సన్‌రైజర్స్‌కు ప్యాట్ కమిన్స్ గుడ్‌బై!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు.

అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది.

SRH Captain Pat Cummins Unlikely to Play in Upcoming Season Reveals Aakash Chopra

అయితే రిటైన్ లిస్ట్ ప్రిడిక్షన్ గురించి తన అభిప్రాయాలు తెలుపుతున్న భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్‌కు ప్యాట్ కమిన్స్ ఆడటం అనుమానమే అని, ఈ విషయాన్ని తనతో చెప్పాడని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ గత మినీ వేలంలో రూ.20.50 కోట్లు పలికిన విషయం తెలిసిందే. బౌలర్, బ్యాటర్, కెప్టెన్‌గా జట్టుకు విలువ తీసుకువచ్చే కమిన్స్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ రూ.కోట్లు కుమ్మరించింది.

ఐపీఎల్ 2025 రిటైన్ లిస్ట్‌లోనూ కమిన్స్‌కు ప్రథమ ఎంపిక ఇవ్వాలని నిర్ణయించింది. గత సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన అతనికి రూ.18 కోట్లు ఇవ్వడానికి కావ్య సిద్ధమైందని తెలిసింది. కానీ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు కావ్యను అయోమయంలోకి నెట్టినట్లు సమాచారం. విదేశీ ప్లేయర్లపై బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కమిన్స్‌ను వెనకడుగు వేసేలా చేసాయని చోప్రా అన్నాడు.

''ఐపీఎల్‌లో ఆడతానే లేదో అని కమిన్స్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ల ప్రాధాన్యత వేరు. యాషెస్‌ సిరీస్, వరల్డ్ కప్‌లపై ఫోకస్ చేస్తారు. ఈ మధ్యలో ఐపీఎల్‌ను ఆడటానికి ప్రయత్నిస్తారు. అయితే కొత్త నిబంధనలు కూడా తనని ఆలోచించేలా చేస్తున్నాయని కమిన్స్ అన్నాడు'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

విదేశీ ప్లేయర్లపై రూల్స్ ఇవే:
మెగా వేలంలో పాల్గొనేందుకు విదేశీ ప్లేయర్ మొదట రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోని విదేశీ ఆటగాళ్లు తర్వాత జరిగే మినీ వేలంలో పాల్గొనడానికి అవకాశం లేదు. అలాగే మెగా వేలంలో కొనుగోలైన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందు.. అందుబాటులో ఉండట్లేదని తెలిపితే, రెండు సీజన్ల వేలంలో అతను నిషేధానికి గురవుతాడు.

Story first published: Wednesday, October 16, 2024, 12:11 [IST]
Other articles published on Oct 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+