IPL 2022: ఈ సీజన్లోనే అతితక్కువ ప్రభావం చూపిన ప్లేయర్‌గా విలియమ్సన్

న్యూజిలాండ్, మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు అన్ని ఫార్మాట్లలో స్థిరమైన రన్ స్కోరర్‌గా పేరుంది. ఐపీఎల్ 2022లో మాత్రం అతను పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్లో ఇటీవలే 2000పరుగుల మైలురాయిని దాటాడు. అయినప్పటికీ అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోవట్లేదని, చిన్న ఇన్నింగ్స్‌ను పెద్దవిగా మలచలేకపోతున్నాడంటూ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పేర్కొన్నాడు. సన్ రైజర్స్ కెప్టెన్‌గా ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తున్న కేన్ విలియమ్సన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదని, ధాటిగా ఆడట్లేదని పేర్కొన్నాడు. 15వ ఓవర్ వరకు తాను బ్యాటింగ్ చేయాలనే బాధ్యతతో ఆడాలనుకోవడం కరెక్టే కానీ.. ఏమాత్రం దూకుడును ప్రదర్శించకపోవడం ఐపీఎల్ లాంటి టోర్నీలో కరెక్ట్ కాదని జాఫర్ అన్నాడు. అతను బ్యాటింగ్ లైనప్‌లో చాలా ముఖ్యమైన ఆటగాడైనప్పటికీ కనీసం 100స్ట్రైక్ రేట్‌తో కూడా బ్యాటింగ్ చేయకపోవడం సరికాదని జాఫర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఇంపాక్ట్ విలువ మైనస్‌లో ఉంది. ఈ టోర్నీలో ఏ ప్లేయర్ కు లేనంత తక్కువగా విలియమ్సన్ ఇంపాక్ట్ విలువ ఉండడం సన్ రైజర్స్‌ను కలవరపరుస్తుంది. అతని ఇంపాక్ట్ విలువ -85గా ఉంది. అంటే అసలు మ్యాచ్ విషయంలో అతను ఎలాంటి తన మార్క్ చూపించలేకపోతున్నాడన్న మాట. ఇది ఓ కెప్టెన్‌గా విలియమ్సన్ ఎదుర్కొంటున్న చెత్త విషయమనే చెప్పాలి.

కేవలం 96 స్ట్రైక్ రేటుతో ఈ సీజన్లో 200పరుగులు చేసిన కేన్ విలియమ్సన్‌కు ఇది అత్యంత ఫెయిల్యూర్ ఇండివిడ్యూవల్ ప్రదర్శనగా చెప్పొచ్చు. అతని బ్యాటింగ్ వల్ల సన్ రైజర్స్ టాపార్డర్లో ఇతర బ్యాట్స్ మెన్‌పై చాలా ప్రెషర్ పెరుగుతుంది. వన్డే, టెస్ట్ మాదిరిగా ఆడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అభిమానులు సైతం అతని ఆట పట్ల సీరియస్ అవుతున్నారు. అతని చెత్త బ్యాటింగ్ ప్రదర్శనను బౌలింగ్ పరంగా పోల్చితే.. 10మ్యాచ్‌ల్లో 12ఎకానమీ రేటుతో ఓ బౌలర్ బౌలింగ్ వేసినదానితో సమానం. ఇలాంటి బౌలింగ్ చేస్తే ఏ బౌలర్ నైనా జట్టు నుంచి తొలిగించడం ఖాయం. అలాంటి చెత్త ప్రదర్శన కనబరుస్తున్న కేన్ మామ.. కెప్టెన్ హోదాతో బతికిపోతున్నాడు. ఇకనైనా అతను పుంజుకుంటాడని ఆశిద్దాం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications