Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ (Video)

సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఫామ్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగు అభిమానులు కోరుకుంటున్న విధంగా ఈ సీజన్‌లో SRH చెలరేగుతోంది. ప్యాట్ కమిన్స్ రాకతో జట్టులో దూకుడు పెరిగింది. రికార్డుల వేటలో చిరుతలా దూసుకెళ్తూ సంచలనాలు సృష్టిస్తోంది. సన్‌రైజర్స్ గుర్తొస్తే ఇతర ఫ్రాంచైజీలు వణికిపోయేలా ప్రదర్శన చేస్తోంది.

11 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్న ఆర్సీబీ 262 స్కోరు రికార్డును ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది. ప్రత్యర్థి ప్లేయర్లపై కనికరం చూపకుండా విరుచుకుపడుతోంది. టాప్ స్కోరర్ జట్టుగా పేరు ఉన్న ఆర్సీబీపైనే 287 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఇక బలమైన ముంబై ఇండియన్స్‌ను (277 రన్స్) ఎస్‌ఆర్‌హెచ్ వదిలిపెట్టలేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (266 పరుగులు) విధ్వంసం సృష్టించింది.

SRH Captain Cummins Delights Fans with Telugu Movie Dialogues

ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదింట్లో నెగ్గి పాయింట్ల పట్టకలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్ సంచలన ప్రదర్శనను చూసి ఆరెంజ్ ఆర్మీ ఎంజాయ్ చేస్తోంది. తెలుగు టీమ్ ఖాతాలో మరో టైటిల్ ఖాయమని భరోసాతో ఉంది. కాగా, SRH అభిమానులకు కెప్టెన్ కమిన్స్ విజయాలతో పాటు మరో గిఫ్ట్ అందించాడు. తెలుగు ఫేమస్ డైలాగ్స్‌ను ఎలాంటి తడబాటు లేకుండా చెబుతున్నాడు.

గతంలో తెలుగు ప్రజలకు చాలా దగ్గరగా అయినా డేవిడ్ వార్నర్ తరహాలో కమిన్స్ ఇప్పుడు మన వాళ్లకు చేరవవుతున్నాడు. స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్‌ చెబుతూ కమిన్స్ అభిమానులను అలరిస్తున్నాడు. డైలాగ్స్‌ మాత్రమే కాదు, మన హీరోల మాదిరిగానే బాడీ లాంగ్వేజ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు.

'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను', 'కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్, ఊర మాస్', 'ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ కమిన్స్ డైలాగ్స్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా, సొంతమైదానంలో ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ రేపు తలపడనుంది.

Story first published: Wednesday, April 24, 2024, 14:56 [IST]
Other articles published on Apr 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+