Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH-RCB ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!

ఐపీఎల్-2024‌లో క్లైమాక్స్ ఫైట్ షురూ అయ్యింది. మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభయ్యాయి. అయితే హోరాహోరీగా సాగుతాయనుకుంటే క్వాలిఫయిర్-1 ఏకపక్షంగా మారింది. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కేకేఆర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మరోవైపు ఘోర పరాజయాన్ని చవిచూసిన ఎస్‌ఆర్‌హెచ్ తుదిపోరు అర్హత సాధించాలంటే క్వాలిఫయిర్-2లో తప్పక నెగ్గాల్సి ఉంటుంది. కాగా, ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయత్స్ తలపడనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్తు కోసం రెండో క్వాలిఫయిర్-2‌లో సన్‌రైజర్స్‌తో పోటీపడాల్సి ఉంటుంది.

SRH and RCB Fans Clash Over Samantha s Post Here s Why

అయితే ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ప్రముఖ నటి సమంత చేసిన ఓ పోస్ట్ నెట్టింటిని షేక్ చేస్తోంది. సమంత భావాన్ని అర్థం చేసుకోలేక నెటిజన్లు తమకు నచ్చిన ఊహాగానాలు మొదలుపెట్టారు. సమంత ఏ విషయాన్ని ఉద్దేశించిందో తెలియక తమ బుర్రలకు విపరీతంగా పనిచెబుతున్నారు. సమంత అసలేం పోస్ట్ చేసిందంటే..

'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమంత దానికి క్యాప్షన్ ఇలా రాసుకొచ్చింది. ''మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు'' అంటూ మోటివేషనల్ క్యాప్షన్‌ను పోస్ట్‌కు జతచేసింది. అయితే సమంత పోస్ట్‌కు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఆర్సీబీకి మద్దతు ఇస్తుందని కొందరు, ఎస్‌ఆర్‌హెచ్‌కు సపోర్ట్ చేస్తుందని మరికొందరు కామెంట్ బాక్స్‌లో వాదిస్తున్నారు.

దీంతో ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ సమంత మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందని గొడవ పడుతున్నారు. మరోవైపు ఇది క్రికెట్‌కు సంబంధించి కాదని, తన అభిమానుల కోసం సమంత చేసిన పోస్ట్ అని మరికొందరు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. మరి, ఈ పోస్ట్‌పై స్పష్టత రావాలంటే సమంతనే క్లారిటీ ఇవ్వాలి. కాగా, అనారోగ్యం కారణంగా సమంత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల మయోసైటిస్ నుంచి కోలుకోవడంతో తిరిగి నటనపై దృష్టి పెట్టారు. గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ 'మా ఇంటి బంగారం' గురించి అప్‌డేట్ ఇచ్చారు.

Story first published: Wednesday, May 22, 2024, 12:51 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+