నిషేధం రద్దు చేయండి, న్యాయం జరిగేలా చూడండి: రాయ్‌కు శ్రీశాంత్
హైదరాబాద్: భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు శ్రీశాంత్ తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. తాజాగా స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనకుండా బీసీసీఐ అడ్డుకోవడంపై మాజీ పేసర్ శ్రీశాంత్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్‌కు ఓ లేఖ రాశాడు.
లోధా సిఫారసులు అమలు చేయడంలో విఫలమైన బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శలను సుప్రీం కోర్టు ఇటీవలే తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) బీసీసీఐ పాలనా వ్యవహారాలను చూస్తున్నారు. ఈ క్రమంలో సీవోఏ చీఫ్ వినోద్ రాయ్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నాలుగేళ్ల విలువైన కాలాన్ని వృథా చేశారు
కేరీర్‌లో అత్యున్నత దశలో ఉన్నప్పుడు తనపై నేరాన్ని మోపి నాలుగేళ్ల విలువైన కాలాన్ని వృథా చేశారని శ్రీశాంత్ లేఖంలో పేర్కొన్నాడు. స్కాట్లాండ్ లీగ్ ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వకుండా బీసీసీఐ మాజీ బాస్‌లు తనను ఓ దోషిగా చూస్తున్నారని అందులో పేర్కొన్నాడు. తనపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయాలని, న్యాయం జరిగేలా చూడాలని లేఖలో శ్రీశాంత్ కోరాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ అరెస్ట్
2013లో జరిగిన ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా బీసీసీఐ బోర్డు పెద్దలు ఇంకా తనపై కక్ష సాధిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని శ్రీశాంత్ ఆవేదన చెందాడు.

బీసీసీఐ సస్పెన్షన్ వేటు మాత్రమే వేసింది
బీసీసీఐ తనపై సస్పెన్షన్ వేటు మాత్రమే వేసిందని... అది 90రోజులకే ముగిసిందని.. జీవిత కాల నిషేధంపై తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నది శ్రీశాంత్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో చాలాకాలం కేరళలో ఐఏఎస్‌గా పనిచేసిన వినోద్ రాయ్‌కు శ్రీశాంత్ లేఖ రాశాడు.

నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కోర్టుకు సైతం
ఇక్కడ కూడా శ్రీశాంత్ విఫలమైతే తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కోర్టుకెక్కే ఆలోచనలో ఉన్నాడు. తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకుంటున్న బీసీసీఐ, ఐసీసీపై న్యాయపోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండు బోర్డులపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్)లో కేసు వేయనున్నాడనీ, ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ లాయర్ హర్పర్ మెక్‌లియోడ్‌తో చర్చలు కూడా జరిపినట్లు శ్రీశాంత్ సహచరుడు ఎడ్గీ గిబ్స్ తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications