Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి కాబోతున్న పేసర్ శ్రీశాంత్, నిజమేనన్న సోదరుడు

తిరువనంతపురం: కేసులు, వివాదాలతో సతమతమవుతున్న క్రికెటర్ శ్రీశాంత్‌కు శుభవార్త! శ్రీశాంత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ వార్తను అతను స్వయంగా ధ్రువీకరించాడు. అతడి భార్య భువనేశ్వరి కుమారి ప్రస్తుతం గర్భవతి. మే నెలలో ప్రసవం అయ్యే అవకాశముంది.

తన స్నేహితురాలు అయిన భువనేశ్వరి కుమారిని శ్రీశాంత్ 2013 డిసెంబర్ 12వ తేదీన వివాహం చేసుకున్నారు. భువనేశ్వరి ప్రస్తుతం గర్భవతి అని, మే నెల చివరి వారంలో ప్రసవించే అవకాశముందని వైద్యులు చెప్పారని శ్రీశాంత్ సోదరుడు దిపుశాంత్ చెప్పారు. ఈ వార్త నిజమే అని చెప్పారు.

Sreesanth to become a dad

కాగా, ఇటీవలే శ్రీశాంత్‌కు క్రికెట్‌కు సంబంధించిన అంశంలోను కొంత ఊరట లభించిన విషయం తెలిసిందే. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసు నుంచి నిర్దోషిగా బయటపడితే పేసర్ శ్రీశాంత్‌కు అన్ని విధాలా మద్దతు ఇస్తానని బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఐపియల్ పాలక మండలి సభ్యుడు టిసి మాథ్యూస్ ఇటీవల చెప్పారు.

ఢిల్లీ కోర్టులో విచారణ సాగుతోందని, అతను నిర్దోషిగా తేలుతాడనీ తిరిగి క్రికెట్ ఆడుతాడని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసు ఏమవుతందనే విషయం గురించి తాను మాట్లాడబోనని, తాను శ్రీశాంత్‌తో నిన్ననే మాట్లాడానని ఆయన చెప్పారు. కోర్టు శ్రీశాంత్‌ను నిర్దోషిగా ప్రకటిస్తే, అతను తిరిగి క్రికెట్ మైదానంలోకి దిగవచ్చునని, కేరళ క్రికెట్ సంఘం తరఫున తామంతా, బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా తాను శ్రీశాంత్‌కు మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+