
సచిన్, యువీ ప్రోత్సహించారు:
లైవ్ కార్యక్రమం సందర్భంగా 2011 ప్రపంచకప్ నాటి విశేషాలను గుర్తుచేసుకున్న శ్రీశాంత్.. ఆ టోర్నీలో ఆందోళన చెందానని చెప్పాడు. '2011 ప్రపంచకప్‌లో ఆందోళన చెందా. అదే సమయంలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ తన వద్దకొచ్చి ప్రోత్సహించారు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతున్నందున జట్టులోని ప్రతీ ఒక్కరూ సచిన్ కోసమే ఎలాగైనా ప్రపంచకప్ గెలవాలని నిశ్చయించుకున్నాం. కప్ సాధించాం. వేలాది మంది అభిమానుల మధ్య ప్రపంచకప్ గెలవడం గొప్ప అనుభూతి' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. భారత జెర్సీలో అదే తన చివరి మ్యాచ్ అని గుర్తుచేశాడు.

తొలి చూపులోనే ప్రేమించా:
లాక్‌డౌన్ వేళ ఎలా ఉంటున్నారని శ్రీశాంత్‌ని అడగ్గా... 'భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్నా. ఈ సమయంలో నా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించా. నాది ప్రేమ వివాహం. భార్య భువనేశ్వరిని తొలి చూపులోనే ప్రేమించా' అని చెప్పుకొచ్చాడు. భువనేశ్వరిని నిజజీవిత యువరాణిగా పేర్కొన్నాడు. కేరళ పేసర్ భువనేశ్వరిని జైపూర్‌లో తొలిసారి కలిశాడు. 'ప్రేమలో పడిన తర్వాత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నా. వివాదం తరువాత నేను వివాహం చేసుకోవాలా వద్దా అనే సందేహం వచ్చింది. అయితే భువనేశ్వరి కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. ఏ అమ్మాయి అయినా ఈ ప్రతిపాదనను అంగీకరించి వివాహం చేసుకోవడం కష్టతరమైన పరిస్థితి అని నేను భావిస్తున్నాను' అని తెలిపాడు.

ఆయనే అత్యుత్తమ కెప్టెన్:
1983 ప్రపంచకప్ హీరో కపిల్ దేవ్‌ను అత్యుత్తమ కెప్టెన్‌గా అభివర్ణించాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని, జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ లాగా తాను నిత్యం ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఫిట్‌నెస్‌లో లెగ్స్ ఎక్స్‌ర్‌సైజ్ తనకు ఇష్టమైని తెలిపాడు. తన కెరీర్ ఆరంభంలో దాదా తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని తెలిపాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి తాను ప్రొఫెషనల్ క్రికెట్ ప్రపంచంలోకి రానున్నట్లు చెప్పాడు. ధోనీ దిగ్గజ క్రికెటర్ అని కొనియాడిన శ్రీశాంత్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియాకు తిరిగి ఆడాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

2013లో నిషేధం:
2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అతడిపై విధించిన నిషేధాన్ని గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఆగస్టుతో శ్రీశాంత్‌పై విధించిన నిషేధ కాలం పూర్తవుతుంది. దీంతో అతడు కేరళ, టీమ్‌ఇండియాకు ఆడే అర్హత సాధిస్తాడు.


Click it and Unblock the Notifications












