Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'హర్భజన్ జాగ్రత్త.. శ్రీశాంత్ కండలు పెంచాడు' (వీడియో)

Sreesanth New Look Goes Viral In Facebook
Sreesanths new muscular look makes netizens warn Harbhajan to steer clear

హైదరాబాద్: టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తర్వాత జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న ఈ కేరళ పేస్‌బౌలర్.. ప్రస్తుతం కండలు పెంచే పనిలో ఉన్నాడు. అతని కొత్త లుక్ చూసి తనని ఫాలో అవుతున్న సోషల్ మీడియా ఫాలోవర్లు షాక్‌కు గురైయ్యారు. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త లుక్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దీనికితోడు పొడువాటి జుట్టు.. గడ్డంతో టోటల్‌గా డిఫరెంట్ లుక్‌లో శ్రీశాంత్ కనిపిస్తున్నాడు. కండల వీరుడిగా అతని గెటప్ చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొందరైతే గతంలో హర్భజన్‌తో అతనికి జరగిన గొడవను ప్రస్తావిస్తూ.. భజ్జీకి జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా శ్రీశాంత్‌తో కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఒకానొక సందర్భంలో మైదానంలోనే శ్రీశాంత్‌పై చేయి చేసుకున్నాడు హర్ఢజన్.. దాని గురించి జట్టులో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత కూడా శ్రీశాంత్ స్పందించకపోవడం గమనార్హం. కాగా, 2013లో శ్రీశాంత్ ఐపీఎల్ మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని రుజువవడంతో.. అతనిపై జీవిత కాల నిషేదాన్ని జారీ చేసింది క్రికెట్ కంట్రోల్ బోర్డు.

అయినా సరే ఇప్పటికే అవకాశం వస్తే టీమిండియా తరపున ఆడడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్తున్నాడు శ్రీశాంత్. తన లేటెస్ట్ ఫొటోలను పంచుకున్న శ్రీశాంత్ 'బీ ద బెస్ట్ ఆఫ్ యూ' అంటూ కామెంట్ పెట్టి..ఫొటోలు పోస్ట్ చేశాడు.

Story first published: Tuesday, July 24, 2018, 16:11 [IST]
Other articles published on Jul 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+