శ్రీశాంత్‌పై హత్యాయత్నం గొడవ: విరుచుకుపడిన తీహార్ జైలు ఆధికారులు
ముంబై: జైలులో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై కత్తితో హత్యాప్రయత్నం జరిగిందంటూ చేసిన ఆరోపణలను తీహార్ జైలు అధికారులు ఖండించారు. 2013 ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు చేసిన తర్వాత జైలులో శ్రీశాంత్‌పై హత్యాప్రయత్నం జరిగిందని ఆయన బంధువులు ఆరోపించారు.
ఆ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని న్యాయాధికారి సునీల్ గుప్తా ఢిల్లీలో నుంచి ఫోన్‌లో చెప్పినట్లు దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక రాసింది. శ్రీశాంత్ ఆ విషయంపై ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని, ఆ విషయాన్ని తమ దృష్టికి కూడా తీసుకుని రాలేదని ఆయన అన్నారు. బహుశా శ్రీశాంత్ కుటుంబ సభ్యులు కోర్టు సానుభూతి కోసం అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన అన్నారు

ఢిల్లీ కోర్టులో శ్రీశాంత్ కేసులో విచారణ పూర్తయింది. ఈ నెలలోనే తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ విధమైన కథను అల్లి బహుశా శ్రీశాంత్ కుటుంబ సభ్యులు న్యాయమూర్తి ఆలోచనను ప్రభావితం చేయాలని భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యనించారు. నిజమైన న్యాయమూర్తి అటువంటి ప్రకటనలకు ప్రభావితం కాబోరని ఆయన అన్నారు.
32 ఏళ్ల పేసర్ శ్రీశాంత్ 2013 ఐపియల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణపై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఆయన బయట ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications