ఐపీఎల్ 2020 విజేత ముంబై ఇండియన్స్.. చెన్నైకి షాక్!!

కేరళ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుస్తుందని టీమిండియా వెటరన్ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ జోస్యం చెప్పాడు. ట్రోఫీని గెలిచే సత్తా ఆ జట్టుకుందని పేర్కొన్నాడు. అంతేకాదు ప్లేఆఫ్ చేరుకొనే నాలుగు జట్లను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు. లాక్‌డౌన్ వేళ శ్రీశాంత్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన విషయాల్ని అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే.

శ్రీశాంత్ జోస్యం:
కరోనా వైరస్ ముప్పుతో ప్రకటించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ క్రికెట్ స్తంభించింది. ఏప్రిల్, మేలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సైతం వాయిదా పడింది. అక్టోబర్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో లీగ్ జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఇప్పటి నుంచే ఐపీఎల్ విజేత, ప్లేఆఫ్ గురించి చర్చలు మొదలైపోయాయి. ఈ క్రమంలో హలో యాప్ లైవ్ సెషన్‌లో తాజాగా శ్రీశాంత్.. ఐపీఎల్ 2020 విజేత, ప్లేఆఫ్‌కి చేరే నాలుగు జట్లు ఏవో అంచనా వేశాడు.

ఐపీఎల్ 2020 విజేత ముంబై
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్ చేరుకుంటాయని శ్రీశాంత్ అంచనా వేశాడు. ధోనీ ఉన్న ప్రతిసారీ చెన్నైకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నాడు. గత సీజన్‌లో పేలవంగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిలకడగా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ దశకు చేరుకుంటాయని ధీమా వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ 'హిట్‌మ్యాన్' సేన మరోసారి విజేతగా అవతరిస్తుందని శ్రీశాంత్ జోస్యం చెప్పాడు.

ఒక్క టైటిల్ గెలవలేదు:
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవలేదు. నిలకడగా రాణిస్తూ, కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ సారి వేలంలో ఆ జట్టు నాణ్యమైన ఆటగాళ్లనే తీసుకుంది. బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చింది. జట్టు సమతూకాన్ని మరింత పెంచింది. ఇక డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్ఠమైన కూర్పుతో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications