నా పార్టీ బిల్లే 2 లక్షలు అయితది.. కేవలం 10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా?: టీమిండియా పేసర్

S Sreesanth Comeback : 2013 IPL స్పాట్ ఫిక్సింగ్.. 10 లక్షల కోసం చేస్తానా? || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ‌స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్, కేరళ ఆటగాడు ఎస్ శ్రీశాంత్ మరోసారి స్పందించాడు. కేవలం 10 లక్షల రూపాయల కోసం తాను స్పాట్ ఫిక్సింగ్ ఎందుకు చేస్తానని ప్రశ్నించాడు. ఇక గడ్డు పరిస్థితుల నుంచి బయటపడటానికి సహాయం చేసిన తన కుటుంబానికి, అండగా నిలిచిన భారత అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలాడు. శ్రీశాంత్ సహా మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు (అంకిత్ చవాన్, అజిత్ చండీలా) కూడా నిషేదానికి గురయ్యారు.

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా

టీమిండియా మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతూ.. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. తన నిషేధంపై శ్రీ కోర్టు మెట్లు ఎక్కాడు. చివరకు 2019లో సుప్రీం కోర్టు అతడి నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో.. శిక్ష ఏడేళ్లకు కుదించింది.

2020 సెప్టెంబర్‌తో ఆ నిషేధం పూర్తయింది. అనంతరం దేశవాళి క్రికెట్‌లో కేరళ జట్టు తరఫున ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పాల్గొని ఫర్వాలేదనిపించాడు. ఆపై విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ మ‌ధ్య మ్యాచ్‌లో శ్రీశాంత్ ఐదు వికెట్లు పడగొట్టి తనలో పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు.

27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు

27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు

ఐపీఎల్‌ 2021లో ఆడాల‌ని శ్రీశాంత్ ఆశ‌ప‌డినా.. అత‌నిపై ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో క‌నీసం వేలానికి కూడా అర్హ‌త సాధించ‌లేక‌పోయాడు. దాంతో స్పాట్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు 7-8 ఏళ్లుగా క్రికెట్‌‌కు దూరమైన శ్రీశాంత్‌కు నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.

శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఇక 44 ఐపీఎల్ మ్యాచులలో 40 వరికెట్లు తీశాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో శ్రీశాంత్‌ సభ్యుడు.

KKR vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. ప్రసీద్, రస్సెల్ ఔట్! పృథ్వీ షా స్థానంలో స్టీవ్ స్మిత్!!

10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా

10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా

తాజాగా ఎస్ శ్రీశాంత్ ఓ క్రీడా ఛానెల్లో మాట్లాడుతూ... 'ఆ సమయంలో నేను ఇరానీ ట్రోఫీ ఆడాను. ఇక సెప్టెంబర్ 2013లో దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సిద్దమవుతున్నా. మంచి ప్రదర్శన చేసి ఆ సిరీస్ ఆడాలన్నదే నా లక్ష్యం. అందుకే ముందుగానే ప్రాక్టీస్ ఆరంబించా. అలాంటి ఆలోచనలో ఉన్న నేను కేవలం 10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా?. ఓసారి పార్టీ చేసుకుంటే.. ఆ బిల్లే 2 లక్షలు అవుతుంది. అలాంటి వాడిని 10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా? ఇది మీ ఆలోచనకే వదిలేస్తున్నా' అని అన్నాడు. నిషేధం కారణంగా ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడటానికి సహాయం చేసిన తన కుటుంబానికి, అండగా నిలిచిన అభిమానులకు శ్రీశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.

12 గాయాలైన తర్వాత కూడా

12 గాయాలైన తర్వాత కూడా

తన కాలికి 12 గాయాలైన తర్వాత కూడా 130 కిలోమీటర్లకు పైగా బౌలింగ్ చేశానని శ్రీశాంత్ చెప్పాడు. 'ఆ సమయంలో ఒక ఓవర్లో 14 పరుగులు అవసరం అయ్యాయి. నేను నాలుగు బంతులు వేసి ఐదు రన్స్ ఇచ్చాను. ఆ ఐపీఎల్ గేమ్‌లో నో-బాల్, వైడ్ మరియు ఒక్క స్లో బాల్ కూడా లేదు. నా కాలికి 12 శస్త్రచికిత్సల తర్వాత కూడా నేను 130 కిలోమీటర్లకు పైగా బౌలింగ్ చేశాను. నేను ఎలా ఫిక్సింగ్ చేస్తాను' అని భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు. 2013 తర్వాత నిషేధం కారణంగా శ్రీశాంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి వచ్చే ఏడాదన్నా అతడికి అవకాశం దక్కుతుందో చూడాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 28, 2021, 15:59 [IST]
Other articles published on Sep 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X