
జీవితకాల నిషేధంపై శ్రీశాంత్
ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాజస్ధాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ప్రాంఛైజీకి అండగా ఉన్నారే తప్ప తనకు మద్దతు ఇవ్వలేదని వాపోయాడు.

ధోనికి భావోద్వేగంతో ఓ మెసేజ్
ఇక, ధోనికి తాను భావోద్వేగంతో ఓ మెసేజ్‌ను పంపానని దానికి అతడు స్పందించలేదని పేర్కొన్నాడు. 'రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ వైపు నిలిచారు. నా గురించి అన్నీ బాగా తెలిసుండీ మద్దతు ఇవ్వకపోవడంతో చాలా బాధపడ్డా. ధోనికి భావోద్వేగంతో ఓ మెసేజ్ పంపించా. దానికి ధోని కనీసం స్పందించలేదు' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది
'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్‌లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయి' అని శ్రీశాంత్ అన్నాడు.

శ్రీశాంత్ నిషేధంపై కపిల్ దేవ్ ఇలా
కాగా, బీసీసీఐ ఫిక్సింగ్ కుంభకోణంలో ఉన్న మిగతా 13 మందిని ఒకలా తనను మరోలా పరిగణిస్తోందని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. ‘బీసీసీఐ తనపట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుందనేది శ్రీశాంత్ వ్యక్తిగత అభిప్రాయం. దానిపై నేనేమీ మాట్లాడను. కానీ అదే నిజమైతే రుజువులతో రావాలని శ్రీశాంత్‌ను కోరుతున్నాను' అని కపిల్ అన్నాడు.


Click it and Unblock the Notifications











