ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: శ్రీశాంత్
కొచ్చి: తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చిందని పేసర్ ఎస్ శ్రీశాంత్ అన్నాడు. తనపై నిషేధం ఎత్తేయాలని బిసిసిఐ కోరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. బిసిసిఐ కార్యద్రశి అనురాగ్ ఠాకూర్ అపాయింట్‌మెంట్ కోరానని చెప్పాడు.
బిసిసిఐ పెద్దలు తన విషయంలో సానుకూలంగా ఆలోచించడం సంతోషకరమని, వారి నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌తో తనకు సంబంధాలున్నాయనీ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ వంటి వాళ్లతో సంబంధాలున్నాయనీ వచ్చిన ఆరోపణలతో తనను జైలులో పెట్టినప్పుడు తాను అనుభవించిన భాధ వర్ణనాతీతమని అన్నాడు.

తాను శివారాధానతోనే తాను ఆ భావనల నుంచి బయట పడినట్లు శ్రీశాంత్ చెప్పాడు. తాను ఇప్పటికీ వేచి చూస్తానని, ఎవరిపై కూడా దావాలు వేయాలన్న అలోచన లేదని, ఇప్పటికీ క్రికెట్ ఆడాలన్నదే తన కోరిక అని ఆయన చెప్పాడు. తనపై విధించిన జీవిత కాలం నిషేధం ఎత్తేసిన తర్వాత మాత్రమే తాను ప్రాక్టీసు ప్రారంభిస్తానని చెప్పాడు.
నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ఓ టీవీ చానెల్‌కు అనురాగ్ ఠాకూర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందుకు తాను దరఖాస్తు చేస్తానని, బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications