శ్రీశాంత్ ఐపిఎల్ 4లో తన గొంతుని తగ్గించుకున్నాడు: జయవర్దనే

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయం సాధించిన తర్వాత మేము పాయింట్ల పట్టికలో ఆరవ పోజిషన్‌లోకి వెళ్శడం జరిగిందని అన్నారు. మేము ఆడినటువంటి తొమ్మిది ఆటలకుగాను నాలుగు గేమ్స్ గెలవడంతో ఎనిమిది పాయింట్లతో ఆరవ స్దానంలో ఉన్నామని అన్నారు. ప్రస్తుతం ఆడుతున్నటువంటి ట్వంటీట్వంటీ గేమ్స్‌లలో ఆటగాళ్శు ఒకే రకమైన ఆటను ప్రదర్శించాలి. అలా ప్రదర్శించకపోవడం వల్ల మేము చివరి రెండు ఓవర్లలలో కొన్ని గేమ్స్‌ను కొల్పోవాల్సి వచ్చిన పరిస్దితి. ఏది ఐతేనేం ఈ గెలుపుతో మాలో విశ్వాసం పెరిగింది.
15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుచేసింది. ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (37; 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో) సుడిగాలిలా చెలరేగిపోవడంతో.. కొచ్చి లక్ష్యసాధన సు లువైంది. వీరవిహారం చేసిన మెక్‌కల్లమ్.. మైకేల్ క్లింగర్ (18) తో కలిసి 5 ఓవర్లలో 61 పరుగులు జోడించి.. వాన్ డర్ మెర్వ్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తరువాత.. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పార్థివ్ పటేల్ (37 నాటౌట్; 31 బం తుల్లో 5 ఫోర్లతో) వేగంగా స్పందించాడు. ఈ దశలో మైకేల్ క్లింగర్.. మరో రెండు ఓవర్ల తేడాతో మహెల జయర్ధన (7) కూడా ఔటయ్యారు. తరువాత పార్థివ్‌తో జతకలిసిన బ్రాడ్ హాడ్జ్ (24; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో) తనదైన శైలిలో విజృంభిం చడంతో.. 15 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయిన కొచ్చి అలవోకగా విజయం సాధించింది.
అంతకుముందు టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. తెలుగుతేజం వేణుగోపాల్ రావు (40; 36 బంతుల్లో 5 ఫోర్లతో) రాణించాడు. వేణుగోపాల్ రావుకు తోడుగా ట్రెవిస్ బర్ట్.. వేగంగా ఆడి 15 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు జతచేయడంతో ఢిల్లీ 140 పరుగుల గౌరవప్రదమైన స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగించింది. అంతకుముందు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ (15; 9 బంతుల్లో 2 ఫో ర్లు, 1 సిక్స్‌తో) తన సహజశైలిలో వేగంగా బ్యాట్ ఝళిపించాడు. అయితే.. ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో.. ప్రశాంత్ పరమేశ్వరన్ వీరూ జోరుకు కళ్లెం వేస్తూ.. తక్కువ స్కోరుకే పెవిలియ న్‌కు పంపాడు. అయితే.. వీరూ ఔట్ విషయంలో కొంత జాప్యం చోటుచేసుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications