For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: యూ టర్న్ తీసుకున్న క్రికెటర్ శ్రీశాంత్

ఆ తీర్పు వచ్చిన రోజు తాను ఉద్వేగానికి లోనయ్యాయని శ్రీశాంత్‌ వెల్లడించాడు.ఇతర దేశాలకు చెందిన టీ20 లీగ్‌ల్లో పాల్గొనాలన్న ఆసక్తిని మాత్రమే తాను వ్యక్తం చేశానని అన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: మరో దేశానికి నిధ్యం వహిస్తానని తాను అన్నట్టు వచ్చిన వార్తలను టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఖండించాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు. ఇటీవల దుబాయ్‌లో ఓ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరైన శ్రీశాంత్ తాను వేరే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకున్నట్లు ఓ ఇంటర్య్యూలో స్పష్టం చేశాడు.

వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా?

వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా?

'నన్ను బీసీసీఐ నిషేధించింది. అంతేకానీ ఐసీసీ కాదు. నేను భారత్ తరుపున క్రికెట్ ఆడలేనప్పుడు, వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా?' అని శ్రీశాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆదివారం శ్రీశాంత్ మీడియా మాట్లాడాడు. వివిధ దేశాల్లో జరిగే టీ20ల్లో ఆడాలన్నదే తన ఉద్దేశమని అన్నాడు.

ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలు

ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలు

ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో శ్రీశాంత్‌తోపాటు అతడి రాజస్థాన్‌ సహచరులు అజిత్‌ చండేలా, అంకిత్‌ చౌహాన్‌ లను బీసీసీఐ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిషేధాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేయగా, ఆగస్టు 7న సింగిల్‌ జడ్జి బెంచ్‌ అతడిని నిర్దోషిగా తేల్చింది.

శ్రీశాంత్ నిషేధాన్ని సమర్థించిన కేరళ హైకోర్టు

శ్రీశాంత్ నిషేధాన్ని సమర్థించిన కేరళ హైకోర్టు

అయితే దీనిపై బీసీసీఐ మళ్లీ కేరళ హైకోర్టుకు వెళ్లింది. ఈ కేసును విచారించిన చీఫ్‌ జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌ సింగ్, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి, శ్రీశాంత్ నిషేధాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు వచ్చిన రోజు తాను ఉద్వేగానికి లోనయ్యాయని శ్రీశాంత్‌ వెల్లడించాడు.

ఇతర దేశాలకు చెందిన టీ20 లీగ్‌ల్లో

ఇతర దేశాలకు చెందిన టీ20 లీగ్‌ల్లో

ఇతర దేశాలకు చెందిన టీ20 లీగ్‌ల్లో పాల్గొనాలన్న ఆసక్తిని మాత్రమే తాను వ్యక్తం చేశానని అన్నాడు. తనపై నిషేధం ఎత్తివేశాక దుబాయ్‌ టీ10 లీగ్‌ యజమానులు కొందరు తనను సంప్రదించారని వెల్లడించాడు. అలా విదేశీ లీగ్‌ల్లో ఆడాలనుకుంటున్నానని మాత్రమే చెప్పానని, కానీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+