వెర్రివాడిలా ఇన్ని రోజులూ క్రికెట్‌కు దూరమయ్యా: శ్రీశాంత్ ఆవేదన
హైదరాబాద్: నాలుగు సంవత్సరాల క్రితం ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని, ఆటకు దూరమైన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లీగ్ క్రికెట్లో ఆడేందుకు శ్రీశాంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

తిరిగి భారత జట్టులోకి రావాలని భావిస్తున్నా
తద్వారా తిరిగి భారత జట్టులోకి రావాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఎర్నాకులం క్రికెట్ క్లబ్ తరఫున ఫిబ్రవరి 19న జరిగే ఫస్ట్ డివిజన్ రెండు రోజుల మ్యాచ్‌లో ఆడనున్నట్టు శ్రీశాంత్ తెలిపాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల అనంతరం శ్రీశాంత్‌పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసి కేసు పెట్టింది.

స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలను కొట్టేసిన ఢిల్లీ కోర్టు
శ్రీశాంత్ మీద వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలను 2015లో ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో తనపై ఎలాంటి నిషేధమూ లేదని భావిస్తున్నట్టు శ్రీశాంత్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌పై నిషేధం విషయమై సందిగ్ధత నెలకొంది. ఇటీవల స్కాట్లాండ్ లీగ్‌లో ఆడేందుకు శ్రీశాంత్ ఎన్‌ఓసీ అడిగాడు. అయితే బీసీసీఐ అందుకు అంగీకరించలేదు.

సస్పెన్షన్ 90 రోజులు మాత్రమే
ఈ క్రమంలో తనపై సస్పెన్షన్ 90 రోజులు మాత్రమేనని శ్రీశాంత్ చెప్పడం విశేషం. తనపై జీవిత కాల నిషేధం ఉన్నట్లు బీసీసీఐ నుంచి ఎలాంటి లేఖ అందలేదని శ్రీశాంత్ తెలిపాడు. 'అంపైర్లు నన్ను ఎందుకు అనుమతించరు? నేను తీహార్ జైల్లో ఉండగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు మాత్రం లేఖ అందింది. అది 90 రోజులకే మాత్రమే వర్తిస్తుంది' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

వెర్రివాడిలా ఇన్ని రోజులూ క్రికెట్‌కు దూరమయ్యా
తనపై జీవిత కాల నిషేధం ఉన్నట్లు బీసీసీఐ మీడియాలో మాత్రమే ప్రకటించిందని తెలిపాడు. దీనిపై తనకు అధికారిక సమాచారం ఇవ్వలేదని, తానే ఓ వెర్రివాడిలా ఇన్ని రోజులూ క్రికెట్‌కు దూరమైనానని, ఇక ఆ పరిస్థితి ఉండబోదని చెబుతున్నాడు. తనపై సస్పెన్షన్ 90 రోజులు మాత్రమేనని అంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications