For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పాట్ ఫిక్సింగ్ సమరం: శ్రీశాంత్ బౌన్సర్లు, ఆకాశ్ చోప్రా సిక్సర్లు

ఓ అభిమాని వేసిన ప్రశ్న టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, ఆకాశ్ చోప్రాల మధ్య ట్విట్టర్ యుద్ధానికి దారి తీసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఓ అభిమాని వేసిన ప్రశ్న టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, ఆకాశ్ చోప్రాల మధ్య ట్విట్టర్ యుద్ధానికి దారి తీసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌కు భారత జట్టులో గౌతమ్ గంభీర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

దావూద్‌తో సంబంధాలున్నట్లు.., ఏదో తెలియని ప్లాన్: శ్రీశాంత్, భజ్జీపై..

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

కేవలం ఒక టెస్టులో మాత్రమే ఆడిన గంభీర్‌ను ఆ తర్వాత టెస్టుల్లో తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ట్విట్టర్‌లో ప్రస్తావించాడు. దీనిపై ఓ అభిమాని భారత జట్టులోకి మాజీ ఆటగాడు శ్రీశాంత్ వచ్చే అవకాశంపై ఓ ప్రశ్న వేశాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

అభిమాని ప్రశ్నకు ఆకాశ్ చోప్రా 'అతడు ఆడేందుకు అర్హుడే. అయితే స్పాట్ ఫిక్సింగ్‌ వివాదంలో ఉన్న శ్రీశాంత్‌కు తిరిగి జట్టులో చోటు దక్కించుకోలేడు. ఎవరైతే వారి స్వలాభం కోసం ఆటను అమ్ముకున్నారో అలాంటి వారికి తిరిగి జట్టులో చోటు కల్పించకూడదు' అని అన్నాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

దీనిపై శ్రీశాంత్ ట్విట్టర్ వేదిగా ఆకాశ్ చోప్రా రెండు నాల్కల ధోరణిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బ్రో అని పిలవడానికి కూడా సిగ్గుపడుతున్నా అంటూ శ్రీశాంత్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆకాశ్ చోప్రా కూడా తనదైన శైలిలో శ్రీశాంత్‌కు సమాధానమిచ్చాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

తానేమీ రెండు ముఖాలతో మాట్లాడటం లేదని, ఇది తన అభిప్రాయమని దానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు. తన సొంత తమ్ముడు ఆ విధంగా చేసిన తన పట్ల కూడా అలానే ఉంటానని అన్నాడు. శ్రీశాంత్‌పై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోలేదా? అని ఓ అభిమాని ఆకాశ్ చోప్రాని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అయితే అమీర్ బౌలింగ్‌ను మాత్రమే తాను సమర్ధించినట్లు చోప్రా చెప్పాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

ఇలా చోప్రా, శ్రీశాంత్‌ల మధ్య ట్విట్టర్‌లో దీనిపై పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అభిమానులు సైతం ఈ విషయంలో శ్రీశాంత్‌కే మద్దతుగా నిలవడం విశేషం. 2005లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన శ్రీశాంత్ రెండు వరల్డ్ కప్ విన్నింగ్ సిరిస్‌లు ఆడాడు. 2013లో ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇరుక్కున్నాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో బీసీసీఐ శ్రీశాంత్ క్రికెట్‌ నుంచి జీవితకాలం పాటు నిషేధించింది. చివరకు ఈ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను మళ్లీ భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకుంటాననే ధీమాను శ్రీశాంత్ వ్యక్తం చేశాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing

ఇటీవలే ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ తనని మళ్లీ క్రికెట్‌ ఆడనివ్వకపోతే బీసీసీఐను కోర్టుకీడుస్తానని చెప్పాడు. కోర్టు నిర్దోషిగా ప్రకటించినా బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి సస్పెన్షన్‌ పత్రం కానీ మెయిల్‌ కానీ ఇవ్వలేదని మండిపడ్డాడు. తనని జీవితకాలం పాటు బీసీసీఐ నిషేధించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నాడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడతానని అన్నాడు.

Sreesanth, Aakash Chopra engage in ugly Twitter spat over spot-fixing
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+