విజయవాడ: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆ అగ్రెసివ్‌నెస్ బహుశా స్కూల్ నుంచి అలానే కొనసాగుతుందేమో!.. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇందులో మన టీమ్ ఇండియా కెప్టెన్ ఎక్కడున్నాడో గుర్తుపట్టారా?

మిగతా స్టూడెంట్స్ అంతా బాసింపట్టు వేసుకుని శ్రద్దగా సార్ చెప్పేది ఆలకిస్తుంటే.. మన కెప్టెన్ గారు చూడండి ఎలా కూర్చున్నారో!. రెండుకాళ్లు పైకి లేపి కూర్చుని క్లాస్ వింటున్న కోహ్లిని ఫోటోలో ఎడమ వరుసలో చూడవచ్చు. ఈ ఫోటోను తన చిన్ననాటి జ్ఞాపకంగా..'చక్కటి పాతరోజులు. నేను ఎక్కడున్నానో గుర్తుపట్టండి' అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు కోహ్లి.
ఆటతోనే కాదు.. ఈమధ్య మన క్రికెటర్స్ అంతా సామాజిక మాధ్యమాల్లోను అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఫోటోలతోనో.. కామెంట్స్ తోనో.. మొత్తానికి అభిమానులకు మరింత చేరువవుతున్నారు.