న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అస్ట్రేలియా ఓపెన్: లీ నాకు షాక్, అజరెంకా విజయం

By Pratap
Victoria Azarenka beats Li Na to win Australian Open title
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళా సింగిల్స్‌లో విక్టోరియా అజరెంకా విజయం సాధించింది. వరుసగా రెండోసారి అజరెంకా విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణ నా లీపై 4-6,6-4,6-3 తేడాతో బెలారస్ క్రీడాకారణి అజరెంకా విజయం సాధించింది.

ఈ విజయంతో అజరెంకా నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.అస్ట్రేలియా ఓపెన్ విజయంతో అజరెంకా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకుంది. లీ నా తొలి సెట్‌లో అజరెంకాపై ఆధిపత్యం సాధించింది. తొలి సెట్‌లో లీ నా 3-1 స్కోరుతో ఆధిక్యత సాధించింది.

రెండో సెట్‌లో లీ నా జారిపడింది. ఆమె మోకాలు మడత పడింది. దీంతో రెండో సెట్‌ను 6-4 స్కోరుతో కోల్పోయింది. ఆరో సీడ్ చైనా క్రీడాకారిణి లీ నా 2011 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది.

ఆరో సీడ్ చైనా క్రీడాకారిణి లీ నా సెమీ ఫైనల్‌లో మారియా షరపోవాకు షాక్ ఇచ్చి ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్ నెంబర్ టూ షరపోవాను ఆమె 6-2, 6-2 స్కోరుతో గురువారంనాడు ఓడించింది. అయితే, ఫైనల్లో అజరెంకాను దీటుగా ఎదుర్కోలేకపోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X