రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సచిన్
న్యూఢిల్లీ, జూన్ 4: అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డులను సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు నుండి కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. సోమవారం ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభ ఛైర్మన్ డాక్టర్ హామీద్ అన్సారీ తన ఛాంబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. సచిన్ రాజ్యసభకు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రక్కన సచిన్ భార్య డాక్టర్ అంజలి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా ఉన్నారు.

ఏప్రిల్ 27న రాజ్యసభకు నామినేట్ అయిన సచిన్ టెండూల్కర్... క్రికెట్ టీమ్‌లో కొనసాగుతూనే రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి క్రికెటర్ కావటం విశేషం. సచిన్‌తో పాటు రాజ్యసభకు నియమితులైన సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను అగా ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఐపిఎల్-5 షెడ్యూల్ కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు.
రాజ్యసభకు నామినేట్ చేసిన 12 మంది సభ్యుల్లో సచిన్ కూడా ఉన్నాడు. సచిన్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అంతక ముందు రాజ్యసభ సభ్యుడిగా సచిన్ టెండూల్కర్ నియామకం చెల్లదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
సచిన్ ప్రమాణ స్వీకారా న్ని నిరోధించలేమని తేల్చిచెప్పింది. అయితే దీనిపై తదుపరి విచారణ తేదీ జూలై 4 లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజ్యసభ సభ్యులుగా క్రీడాకారుల నియామకం ఏ విభాగంలోకి వస్తుందో తెలపాలని తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎకె సిక్రి, జస్టిస్ రాజీవ్ సహాయ్‌తో కూడిన బెంచ్ అదనపు సొలిసిటర్ జనరల్ చాందియాక్‌ను ఆదేశించింది.
ప్రమాణ స్వీకారం నిలుపుదలకు నిరాకరిస్తూ... స్పోర్ట్స్ కేటగిరీపై స్పష్టత కోరింది. రాష్ట్రపతి విచక్షణాధికర నియామకానికి అది వర్తిస్తుందా లేదో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు పంపడంపై ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే రామ్‌గోపాల్ సిసోడియా అనే వ్యక్తి సచిన్ కు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారంటూ పిటిషన్ బుధవారం పిటిషన్ దాఖలు చేశాడు.
ఆయన సభ్యత్వంపై తక్షణం స్టే ఇవ్వాలని, ప్రమాణ స్వీకారం చేయకుండా నిలుపుదల చేయాలని తన పిటిషన్లో కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంది. ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ ఫైల్ చేయాలని మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు విడుదల చేసింది. సచిన్ టెండూల్కర్ తో పాటు రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన బాలీవుడ్ బాలీవుడ్ అందాల నటి రేఖ(57) మంగళవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 'రేఖా గణేశన్ అనే నేను, దేవుడిపై ప్రమాణం చేసి...' అంటూ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, రాజ్యసభ విపక్ష నేత అరుణ్‌జైట్లీతోపాటు ఇతర నేతలకు నమస్కారం చేసి, తనకు కేటాయించిన 99వ నెంబర్ సీటులో ఆశీనులయ్యారు.
తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications