లైవ్‌లో యాంకర్‌ని కౌగిలించుకున్నాడు, గేల్‌తో పోల్చి..
సిడ్నీ: ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రిపోర్టర్ ఒకరు లైవ్ ప్రోగ్రామంలోనే మహిళా సహోద్యోగిని కౌగిలించుకున్నాడు. దీంతో, అతని పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో పోల్చుతూ నెటిజన్లు మండిపడ్డారు.
సదరు ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రిపోర్టర్ పేరు హమీష్ మెక్ లాచ్లాన్. అతను కౌగిలించుకున్న సహోద్యోగిని పేరు మోనికా రుదులోవిక్. ఆమె మాజీ మిస్ యూనివర్స్ కాంటెస్టెంట్ కూడా.

హమీష్ మెక్ లాచ్లాన్ లైవ్ ప్రోగ్రాంలోనే మోనికాను కౌగిలించుకున్నాడు. ఆమె అతనిని పక్కకు నెట్టి వేసింది.
హమీష్‌తో మోనిక మాట్లాడుతూ.. కాస్త ప్రొఫెషనల్‌గా ఉండమని సూచించింది. అతను స్పందిస్తూ... నేను క్రిస్ గేల్‌ను కాదని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇది లైవ్ కావడంతో దీనిని చూసిన వారు... హమీష్ పైన మండిపడ్డారు. వారు కూడా క్రిస్ గేల్‌ను, అతనిని పోల్చుతూ మండిపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications