
ధోనీ తన పేరుతో మహీ రేసింగ్ టేమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో ఇక్కడి బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్‌లో జరిగే రేసుల్లో ధోనీ టీమ్ పాల్గొననుంది. టీమ్ రైడర్లతో కలిసి శనివారం ఇక్కడికొచ్చిన మహీ మూడుగంటలకు పైగా గడిపాడు. క్రికె ట్, బైక్‌లు, రేసులు గెలిచే వ్యూహం గురించి వారితో చర్చించాడు.
బైక్‌ల గురించి మహీకి మంచి అవగాహన ఉండటం పట్ల రైడర్లు ఆశ్చర్యపోయారు. ధోనీతో గడపడం పట్ల రైడర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఫారెట్ ఫ్రాన్స్‌కు చెందినవాడు కాగా, సొఫుగ్లుది టర్కీ. వీరిద్దరికీ క్రికెట్ గురించి గతంలో ఏమాత్రం తెలియదు. అయితే, టీమ్ ఆవిష్కరణ సందర్భంగా మహేంద్రుడితో కలిశాక కాస్త ఆసక్తి ఏర్పడిందని వీరిద్దరూ తెలిపారు.